మేనేజర్లు,ఏఈఈ పోస్టులు


Thu,January 18, 2018 11:39 PM

బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్లు, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ITI-Limited
వివరాలు: ఐటీఐ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. ఇది పబ్లిక్ సెక్టార్ టెలికం కంపెనీ. ప్రస్తుత ఖాళీలను ఐదేండ్ల కాలానికి భర్తీ చేయనున్నారు.
-మేనేజర్ - 20 ఖాళీలు.
-ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, అర్హతలు..
-ఆస్కాన్/డిఫెన్స్ నెట్‌వర్క్ - 4 ఖాళీలు
-జీపీవోఎన్/భారత్ నెట్ - 4 ఖాళీలు
-అర్హతలు: పై రెండు పోస్టులకు బీఈ/బీటెక్‌లో టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ, సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-ఫైనాన్స్- 4 ఖాళీలు
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్‌టైం ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత.
-ఎంకేటీజీ- 4 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఈఈఈ ఉత్తీర్ణత. ఎంబీఏ మార్కెటింగ్ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-హెచ్‌ఆర్- 4 ఖాళీలు
-అర్హతలు: హెచ్‌ఆర్/సోషల్ వర్క్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో రెండేండ్ల ఫుల్‌టైం పీజీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పీజీ డిప్లొమా (సంబంధిత విభాగంలో)
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు
-ఖాళీల సంఖ్య - 25
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.
-కాలపరిమితి: మొదట ఐదేండ్ల కాలపరిమితికి తీసుకుంటారు. తర్వాత అవకాశాన్ని బట్టి రెగ్యులర్ చేయవచ్చు.
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత. జనరల్/ఓబీసీలకు కనీసం 65 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు 63 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 5
-వెబ్‌సైట్: http://www.itiltd-india.com

827
Tags

More News

VIRAL NEWS