రిజర్వ్‌బ్యాంక్‌లో 526 ఖాళీలు


Sat,November 18, 2017 01:31 AM

-దేశ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగం
-పదోతరగతి అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ టెస్ట్ + భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక

RBI
ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలోని అపెక్స్ బ్యాంక్/ కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంక్‌ను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు.
-పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య - 526 (జనరల్-366, ఓబీసీ-100, ఎస్సీ-7, ఎస్టీ-53)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: హైదరాబాద్-27, అహ్మదాబాద్-39, బెంగళూరు-58, భోపాల్-45, చండీగఢ్, సిమ్లా-47, చెన్నై-10, గువాహటి-10, జమ్ము-19, లక్నో-13, కోల్‌కతా-10, ముంబై, నవీ ముంబై, పనాజీ-165, నాగ్‌పూర్-9, న్యూఢిల్లీ-27, తిరువనంతపురం-47
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతిలో ఉత్తీర్ణత. రాష్ర్టాల/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక భాషలో పట్టు ఉండాలి.
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1992, నవంబర్ 2 నుంచి 1999, నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 10,490-23,700/-. ఎంపికైన అభ్యర్థులు వేతన రూపంలో ఆరంభంలోనే నెలకు రూ. 22,339/- వరకు వస్తుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 450/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 50/-)
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్
-ఎంపిక విధానం: రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్ష+భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా
-రాతపరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
-పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రశ్నపత్రం ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
-ఆన్‌లైన్‌టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం లాంగ్వేజ్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
-లాంగ్వేజ్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం స్థానిక భాషలో నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
-ఆన్‌లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
-చివరితేదీ: డిసెంబర్ 7
-పరీక్ష తేదీ: 2018 జనవరి/ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.rbi.org.in

12114
Tags

More News

VIRAL NEWS