‘సోషల్ వెల్ఫేర్‌’లో ఇంటర్ ప్రవేశాలు


Sun,January 13, 2019 11:36 PM

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమసంత్సరం ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
minority-students
-తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈ) పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలు.
-కోర్సు: ఇంటర్ (మొదటి సంవత్సరంలో ప్రవేశాలు)
-అర్హత: మార్చి-2019లో పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు లేదా తత్సమాన కోర్సు అభ్యర్థులు. పదోతరగతిలో ఏ1-బీ2 జీపీఏ సాధించిన అభ్యర్థులు సైనిక్/ఐఐటీ, సీవోఈల్లో ప్రవేశాలకు అర్హులు. మిగిలినవారు జనరల్, వొకేషనల్ కాలేజీల్లో ప్రవేశానికి అర్హులు.
-పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రెండులక్షలు, గ్రామీణ ప్రాంత విద్యార్థు ల వార్షికాదాయం లక్షాయాభైవేలు మించరాదు. ఎంఆర్‌వో ధృవీకరించిన సర్టిఫికెట్ సమర్పించాలి.
-తెలుగు/ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అర్హులు.
-2019, ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లు మించరా దు. ఎస్సీ, క్రిస్టియన్స్‌గా కన్వర్టెడ్ అయిన ఎస్సీల కు వయస్సులో రెండేండ్లు సడలింపు ఉంటుంది.
-రిజర్వేషన్లు: ఎస్సీ-75, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్-2, ఎస్టీ-6, బీసీ-12, మైనార్టీలు-3, ఓసీ/ఈబీసీ-2 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు. మొత్తం మీద 3 శాతం సీట్లను పీహెచ్‌సీలకు కేటాయిస్తారు. పీహెచ్‌సీ విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశాలకు అర్హులు కారు.
నోట్: మెరిట్, కమ్యూనిటీ రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా. పేపర్ బేస్డ్ ఓఎంఆర్ టెస్ట్ మొత్తం 160 మార్కులకు ఉంటుంది.
-ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటా యి. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు ఇస్తారు. తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు. జంబ్లింగ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
-పరీక్ష విధానం: పరీక్షలో మ్యాథ్స్-30, ఫిజికల్ సైన్స్-30, బయోసైన్స్-30, సోషల్ స్టడీస్-30, ఇంగ్లిష్ (కాంప్రహెన్షన్, గ్రామర్)-20, జీకే, కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు.
నోట్: ఐఐటీ, సీవోఈ, సైనిక్ స్కూల్ ప్రవేశాల కోసం సెకండ్ లెవల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. నాన్-స్పెషలైజ్డ్ కాలేజీల్లో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్-1 ఒక్కటే సరిపోతుంది.
-సైనిక్ స్కూల్: కరీంనగర్, రుక్మాపూర్‌లోని రాష్ట్రస్థాయి సైనిక్ స్కూల్. కేవలం బాలురు (పీహెచ్‌సీ కాకుండా) మాత్రమే అర్హులు. ఇక్కడ ఎంపీసీ గ్రూప్ ఒక్కటే ఉంటుంది.
-ఈ స్కూల్‌లో ప్రవేశాల కోసం రెండో స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మూడోదైన ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు.
సైనిక్ స్కూల్ (సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్)
-ఈ పరీక్షలో మ్యాథ్స్-45, ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-15 ప్రశ్నల చొప్పున ఇస్తారు. మొత్తం 150 ప్రశ్నలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/తెలుగు మీడియంలలో ఇస్తారు. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
నోట్: ఇంటర్‌లో బోధన ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 23
-హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు
-మొదటి స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 17
-వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 180042545678లో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: http://tsswreisjc.cgg.gov.in

సీవోఈ, ఐఐటీ గౌలిదొడ్డి (సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్)

-ఐఐటీ గౌలిదొడ్డి (బాలురు), సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (కరీంనగర్, కో ఎడ్యుకేషన్), గౌలిదొడ్డి (బాలికలు) కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఇస్తారు. బైపీసీ వారికి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఇస్తారు. సీఈసీ గ్రూప్ వారికి మ్యాథ్స్-45, సోషల్-55, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-15, జీకే&కరెంట్ అఫైర్స్-15 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.

కాలేజీలు

-బాలుర కాలేజీలు: మంచిర్యాల, కరీంనగర్, జనగామ, భద్రాది/కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి (చిలుకూరు, ఇబ్రహీంపట్నం, హిమాయత్‌నగర్), హైదరాబాద్(షేక్‌పేట), సంగారెడ్డి (హుత్నూర్, కొండాపూర్), కామారెడ్డి (బిక్‌నూర్), యాదాద్రిభువనగిరిలో ఉన్నాయి.

బాలికల కళాశాలలు:

-ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, ఖమ్మం (ఖమ్మం, దానవాయిగూడెం), రంగారెడ్డి (కమ్మదానం, నార్సింగి, నల్లకంచె), మేడ్చల్, హైదరాబాద్ (మహేంద్రహిల్స్), సంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ.
-వీటితోపాటు 38 ఐపీఈ బాలుర కళాశాలలు, 82 బాలికల కళాశాలలు, రెండు బాలుర వొకేషనల్ కాలేజీలు, తొమ్మిది బాలికల కళాశాలలు ఉన్నాయి.

914
Tags

More News

VIRAL NEWS