హైదరాబాద్ ఐఐసీటీలో ఖాళీలు


Thu,May 18, 2017 12:10 AM

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IICT
వివరాలు:
ఐఐసీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టు పేరు: సైంటిస్ట్ -19 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-7, ఎస్టీ-2, పీహెచ్‌సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ/ ఫిజిక్స్ (మెటీరియల్ సైన్స్), కెమిస్ట్రీ కెటలైసిస్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జువాలజీ, ఎంటమాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ లేదా తత్సమాన సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ, వెటరర్నీ సైన్స్‌లో ఎంవీఎస్‌సీ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 6600/- (సుమారుగా నెలకు రూ. 87, 107/- పే స్కేల్ ఉంటుంది.)
వయస్సు: 2017 జూన్ 30 నాటికి 32 ఏండ్లకు మించరాదు.
పోస్టు పేరు: ప్రిన్సిపాల్ సైంటిస్ట్ -5 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా తత్సమాన సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ, ఎంబీబీఎస్+పీహెచ్‌డీ లేదా ఎంబీబీఎస్+ఎండీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. రూ. 37,400-67,000+ గ్రేడ్ పే రూ. 8700/- (సుమారుగా నెలకు రూ. 1,47,424/- పే స్కేల్ ఉంటుంది.)
వయస్సు: 2017 జూన్ 30 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Section Officer, Recruitment Section, CSIR-Indian Institute of Chemical Technology, Uppal Raod, Tarnaka, Hyderabad 500 007
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్ : http://www.iictindia.org

1049
Tags

More News

VIRAL NEWS