సూఫీ ఉద్యమం


Fri,June 16, 2017 01:08 AM

-హిందూ మత ప్రభావం పడిన ముస్లింశాఖ
- సూఫీ
-సూఫీశాఖ మీద హిందూ మత ప్రభావంతోపాటు బౌద్ధ, క్రైస్తవ, జొరాష్ట్రియన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది.
-సూఫీ మతానికి మూల సిద్ధాంతం: వహదత్-ఉల్-పుజుద్ లేదా జీవైక్యం.
-ఈ వ్యవస్థలో బోధకుడు (పీర్), శిష్యుల (మురీద్) మధ్య అనుసంధానం కీలకమైంది.
-అబుల్‌ఫజల్ ప్రకారం మొఘలుల కాలంలో 14 సూఫీ వర్గాలు ఉండేవి.
Ajmer-Sharif

సూఫీ సిద్ధాంతాలు

-సూఫీలు ఏకేశ్వరోపాసకులు.
-వీరిని హిందూ, బౌద్ధ సిద్ధాంతాలైన అహింస, భగవత్భక్తి, త్యాగం, సంయమనం మొదలైన లక్షణాలు బాగా ఆకర్శించాయి.
-వీరికి నమాజ్ (ప్రార్థన), హజ్ (తీర్థయాత్ర), రోజా (ఉపవాసం)లపై నమ్మకం లేదు.
-భగవంతునికి సంగీతం ప్రీతిపాత్రమని విశ్వసిస్తారు.
-భగవంతున్ని చేరడానికి పీర్ (గురువు) అవసరమని భావిస్తారు.
-హిందూ సిద్ధాంతాలైన అగ్నిపూజ, యజ్ఞోపవీతధారణ, యోగ మొదలైన వాటిని వీరు అనుసరించారు.
-సూఫీ మతంపై ఏమాత్రం ప్రభావం చూపని మతం జైనమతం.
-సూఫీ అనే పదాన్ని మొట్టమొదట బస్రా జహీజ్ (869 AD) అనే ఇస్లాం గురువు ఉపయోగించారు.
-సూఫీశాఖలను శిల్‌శిలా అంటారు. అవి 14 ఉన్నట్లు అబుల్ ఫజల్ రాశాడు. అయితే, మన దేశంలో రెండు మాత్రమే ప్రసిద్ధి చెందాయి.

అవి 1. చిస్తీశాఖ 2. సుహ్రావర్దీశాఖ చిస్తీశాఖ

-స్థాపకుడు - ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ.
-1143లో తూర్పు పర్షియాలోని సిస్తాన్ ప్రాంతంలో జన్మించారు.
-1192లో మహ్మద్ ఘోరీ సైన్యంతోపాటు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి వచ్చి అజ్మీర్‌లో స్థిరపడ్డారు.
-ఇతని సమాధి అజ్మీర్‌లో ఖ్వాజీసాహెబ్ దర్గాగా ప్రసిద్ధి చెందింది.
-ఏకేశ్వరోపాసనను ప్రతిపాదించారు.
-భక్తి సంగీతంతో భగవంతుని ప్రతిగావించవచ్చునని చెప్పాడు.
ఇతని శిష్యుల్లో ప్రముఖులు
1. సుప్రసిద్ధ కవి - అమీర్ ఖుస్రూ
2. చరిత్రకారుడు - జియావుద్దీన్ బరౌనీ
3. ఖ్వాజా కుతుబుద్దీన్ భక్తియార్

చిస్తీశాఖకు చెందిన పీర్‌లలో ముఖ్యులు

-షేక్ నిజాముద్దీన్ ఔలియా (క్రీ.శ. 1236-1325)
-షేక్ సలీం చిస్తీ (అక్బర్ సమకాలికుడు)
-చిస్తీశాఖలో గురువులు కావాలని అనేకమంది పేదరికాన్ని అనుభవించి, ఉపవాసాలు చేసి, శరీర క్లేశాన్ని కొని తెచ్చుకొనేవారు.
-షేక్ నిజాముద్దీన్ ఔలియా మహబూబ్ - ఇ - ఇలాహీ అని పిలువబడ్డాడు. అతని సమాధి ఢిల్లీలో ఉంది. దీనిని మహ్మద్-బిన్- తుగ్లక్ నిర్మించాడు.
-ఔలియా శిష్యుల్లో ప్రముఖుడు అయిన షేక్ నాసరుద్దీన్ మహ్మద్ చిరాగ్-ఈ-ఢిల్లీ అని కీర్తించబడ్డాడు. నాటి రాజకీయాలు ప్రజా జీవనాన్ని ఎంత సంక్షుభితం చేశాయో ఇతను తన శతసంభాషణలులో వివరించాడు.
-నాసరుద్దీన్ మహ్మద్ శిష్యుల్లో సయ్యద్ గేసు దరాజ్ ముఖ్యుడు. ఇతను పేదలను అమితంగా ప్రేమించడంతో బంద నవాజ్ అని పిలువబడ్డాడు.

సుహ్రావర్దీశాఖ

-అతి ప్రాచీనమైన శాఖ. వీరు సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు.
-స్థాపకుడు బాగ్దాద్ వాస్తవ్యుడైన షేక్ షిహాబుద్దీన్ సుహ్రావర్దీ.
-దీనిని భారతదేశంలో వ్యాప్తిచేసిన వాడు షేక్ షిహాబుద్దీన్ జకారియా సుహ్రావర్దీ
-జకారియా ఉపవాసాలు చేయడం, దారిద్య్రాన్ని అనుభవించడాన్ని వ్యతిరేకించాడు. ఎంతో సంపద కూడబెట్టాడు.
-హిందూ మతాచారాల ప్రభావం పడకుండా చూసుకున్నాడు.
-జకారియాకు ఇల్‌టుష్‌మిష్ షేక్-అల్-ఇస్లాం అనే బిరుదును ఇచ్చి సత్కరించాడు.
-ఖ్వాజా కుతుబుద్దీన్ భక్తియార్ కాకీ సుహ్రావర్దీ వ్యవస్థకు చెందినవాడు. ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌లో గల ఆయన సమాధిని ప్రజలు మతాలకు అతీతంగా కొలుస్తారు.

839
Tags

More News

VIRAL NEWS