సీఐఎస్‌ఎఫ్‌లో 429 ఖాళీలు


Thu,January 17, 2019 11:09 PM

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CISF
-పోస్టు పేరు: హెడ్‌కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
-పనిచేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
-మొత్తం ఖాళీలు-429 (జనరల్-222, ఓబీసీ-114, ఎస్సీ-63, ఎస్టీ-30)
-వీటిలో పురుషులు-328, మహిళలు-37, ఎల్‌డీసీఈ-64 కేటాయించారు.
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: లెవల్ 4 ప్రకారం రూ. 25,500-81,100/- ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలు ఉంటాయి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: ఫురుషులు 167 సెం.మీ., మహిళలు 155 సెం.మీ ఉండాలి.
-ఛాతీ: పురుషులు-77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి
-బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ, స్కిల్ టెస్ట్ ద్వారా
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లిష్/హిందీ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. 2 గంటల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.
-రాతపరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లోనే నిర్వహి స్తారు,
-పరీక్షలో అర్హత మార్కులు- జనరల్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను సంబంధిత రీజినల్ ప్రాంతీయ కార్యాలయానికి పంపాలి.
చిరునామా: DIG, CISF (South Zone), Rajaji Bhavan, D Block, Besant Nagar, Chennai -600090
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్‌సైట్: https://cisfrectt.in

594
Tags

More News

VIRAL NEWS