సాహితీ సేవకులుదోర్బల వేంకటరాజశర్మ


Fri,May 19, 2017 01:23 AM

thala
-సంస్కృత కవి పండితులకు రామాయంపేట, దోర్బల వంశస్థుల్లో చెప్పుకోతగ్గవారు 1929లో జన్మించిన దోర్బల వేంకటరాజశర్మ. వీరు సరస్వతమ్మ, సాంబశివశర్మ దంపతుల కుమారుడు. సాహిత్య విద్యాప్రవీణ BOL చేసి గొప్ప కవివరేణ్యులుగా చరిత్రకు ఎక్కినారు. మహాకవి బాణభట్టు, అదృష్ట దీపిక, భక్తకవి జయదేవుడు, ప్రబోధ గేయాలు, వ్యాసాలు వీరి ముద్రిత గ్రంథాలు.
ఉదా: చదువులకు తల్లి సాహిత్య సరసవల్లి
నీదునిలయం విజ్ఞాన నిలయమమ్మ
మధుర మంజులవాణి వాజ్మహిమజేయు
శారదామమ్ము సువిద్యా విశారదులుగా!

-వీరి విజయ విలాస నాటకం నేడు ఆంధ్రప్రాంతంలో ఉంది.

దోర్బల విశ్వనాథశర్మ


-సంస్కృతాంధ్రాంగ్ల, హిందీ భాషాప్రవీణులు. విద్వత్ కవివరేణ్యులు. అనంత లక్ష్మమ్మ, రత్నయ్య దీక్షితులకు 1933, జూన్ 7న జన్మించారు. దాదాపు 20 మహాగ్రంథాలను యావత్ మూడు ప్రాంతాలకు అందించిన మహా ఘనాపాఠి. సంస్కృత భాగవతం, పోతన అనువాద విశిష్టత, బృందావనం (సంస్కృత రచన), గణరాజ ప్రార్థన పద్యరచన సంస్కృతాంధ్ర వ్యాసాలు, గద్య పద్యాలు.
ఉదా: బాలనీబోసి నవ్వు లోపలను నాకు

పరమహంసల నిర్మలత్వమ్ముదోచె
బాలనీయం(యుంగ) యుక్కులో ప్రణవరవం
మధురై నిండెనా హృదంబరమునందు
-ఇప్పటికీ ఎందరికో ఆయన మార్గదర్శి.

కస్తూరి ఆనందాచార్య


-జగమెరిగిన ఉద్దండ పండిత ప్రకాండులు. ఈయన జననీజనకులు సీతమ్మ, రామాచార్యులు. దాదాపుగా 20 గ్రంథాలను వెలువరించినారు. నాటకం, కథలను కూడా తెలంగాణానికి అందించినారు. ఈయన నాటకం ఆంధ్రాలో తెనాలి రంగస్థల కళాకారుల సంఘంవారు, ఆంధ్రాక్రాంతి థియేటర్స్ వారు ప్రదర్శించినారు. ఈయన పేరుపై ఇప్పటికీ సంగారెడ్డిలో స్మారక సాహిత్య అవార్డును ప్రతి ఏడాది ఇస్తూనే ఉన్నారు. వీరు రాసిన మన్వంతరం అనే చిన్న నాటికను రామంచ జైహింద్ లైబ్రరీవారు కూడా ప్రదర్శించినారు. వీరు రాసిన గ్రంథం పుల్లూరు దేశరాజు ఇంట్లో ఉండేది. చరిత్ర చరణం నవల ఆలోచించతగ్గది. నా కాలమిక రాయలేదు. నా కాలమిక రాయబోదు అని వినయంగా భావాలను, పుష్పాలను మాలలుగా మార్చబోదు అని గర్వంగా చెప్పిన కవితోత్తములు ఈయన.

ఏఎస్ జాషువా


-వీరు పూర్వం మహబూబ్‌నగరం ఆలేరు గ్రామంలో నివసించి ప్రధానాచార్యులుగా పనిచేసినారు. ఉస్మానియా నుంచి ఎంఏ పట్టా పొంది సతీభూస్థాపనం, శీలవతి పరిణయం, అముద్రిత గ్రంథాలు, రేచర్ల దొరల చరిత్ర, కుతుబ్‌షాహీ రాజుల చరిత్ర, రజియాసుల్తానా, ఇస్మాయేలు, ముగ్దలయువతి అనే 7 ఖండ కావ్యాలను రచించి, మరుగునపడిన కవిగా మిగిలిపోయారు.

ఉదా: పుష్పశరుండు నీకు సరిపోడు నిజంబుగ నందకాడవే
రుష్పములిత్తు గైకొనుము పుణ్యవతంస విహార కేళిమా
పుష్పవంబునందు సరిపోదు విరాళియదేల పొమ్ముయే
పుష్పలిహంబులందుజనబూనవు భూవర నీవెరుంగవే!!!
- శీలవతి పరిణయం
-అలాగే ఈ కవి తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా రాశాడని చెబుతున్నారు.

ఎస్. ప్రభాకర్


-ఒకప్పటి దుద్దెడ వద్ద ఉన్న బందారం వీరి పూర్వీకులది. గుండప్ప, గుండమ్మ వీరి తల్లిదండ్రులు. జహీరాబాద్‌లోని ఎక్కెల్లి గ్రామ నివాసి. హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో వీరికి ప్రవేశం ఉందని చరిత్ర తెలుపుతుంది. ఓంకార పట్టణం (నేటి కోహీర్) గురించిన శాసనం ఈయన హయాంలోనే వచ్చింది. ఏది నిజం 60 కవితల వచన రచన ముద్రితం. 1930లో జన్మించిన వీరి గురించి నేటి కవులకు అంతగా తెలియదు.

ఎం. పుష్పలత


-1944లో జన్మించిన గొప్ప కవయిత్రి. వీరి జననీజనకులు నారాయణమ్మ, దేవీప్రసాద్. గురజాడ రచనలు, స్వతంత్ర రచనలు కొన్ని రచించినారు. వీరి తండ్రి గొప్పసాహిత్య కవిత్వ చక్రవర్తి మల్యాల దేవీప్రసాద్ మెదక్ మండల సాహిత్య చరిత్రను అందించారు.

-గేయరచన అనుబంధం ఉదా:
మల్లెలు వికసించగానే మనసేల పులకరించు
చంద్రుని కిరణాలలోన కలువలేల హసియించు
అంబుధి గర్జనలోన ఆ మయూరి నాట్యమేల
అరుదుని వెచ్చలోన అంబుజముల కాంతియేల॥

శిలె నారాయణ కవి


-1940లో నేటి సిద్దిపేట జిల్లా పాలమాకలో జన్మించారు. జననీజనకులు లకా్ష్మంబ, మల్లన్న. తెలుగు, ఉర్దూ భాషలలో గొప్ప ప్రావీణ్యం కలిగిన కవి. తందనాన ప్రహ్లాద మంగళ హారతులు (20), శ్రీరామ శతకం, భద్రగిరిదక్ష శ్రీరామ భక్తరక్ష అనే మకుటంతో సీస పద్యాల శతకాన్ని రాశారు.
గీ॥ కులంజూడవుశుచిరుచి గుణమునీవు
భక్తజనచింతయే నీకు భాగ్యమేము
భద్రగిరిదక్ష శ్రీరామభక్తరక్ష
పాలమాకుల పురపక్ష పాపశిక్ష

అష్టకాల నరసింహరామశర్మ


-వీరు సంస్కృతం, తెలుగు భాషల్లో శేష పాండిత్యం గల అష్టావధాని. వీరిది రాజగోపాల్‌పేట. అధ్యాపకత్వం, జ్యోతిష్యం వృత్తి. కవిత్వం, దేవాలయ నిర్మాణం, యానుషంగిక ప్రవర్తులు. వీరు మనోహరాంబ, లక్ష్మయ్య శర్మలకు 1943, అక్టోబర్ 7న జన్మించారు. 15వ సంవత్సరంలోనే కవిత్వారంభం కలిగి పురుషోత్తముడు, తుకారం, రామప్రభు శతకం, శ్రీరామ సుప్రభాతం, వాసవేశ్వరీయం, రామాయణ ఖండికలను రచించి యువకవులకు మార్గదర్శకుడయ్యారు. శనిగరంలోని సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మించి, జ్యోతిష్య పండితులుగా, అవధానిగా ఉన్నారు. ఈయన సోదరుడే అష్టకాల రామమోహన్.

ప్యారక శేషాచార్యులు


-ప్రముఖ పద్య, వచన కవి పండితుడు. తెలంగాణలో చెప్పుకోదగ్గ కవీశ్వరులు. వీరు దాదాపుగా ఐదారు గ్రంథాలను రచించినారు.

గౌరీభట్ల రామకృష్ణ శర్మ


-వీరిది వెంకట్రావుపేట గ్రామం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా. వీరు అవధాని. వివిధ అష్టావధానములను ఘనంగా నిర్వర్తించిన ఘనత వీరిది. వీరు కవిశార్దూల కిశోర అనే బిరుదును కూడా పొందిఉన్నారు. వీరి పుత్రులు ఒకరు శతావధాని గౌరీభట్ల మెట్రామశర్మ, మరొకరు గౌరీభట్ల రఘురామశర్మ. రామకృష్ణ కవి రాజరాజేశ్వరీ స్థవం, వేములవాడ. కవి చతుష్టయం, సంతోషీమాత సుప్రభాతం, గోపమాల మానసిక పూజ మొదలైన గ్రంథాలను మన తెలంగాణకు అందించినారు. వీరి శిష్యుడే గుమ్మన్నగారి లక్ష్మీనరసింహరామశర్మ.

thala1

గుమ్మన్నగారి లక్ష్మీనరసింహరామశర్మ


-వీరిది పోతారెడ్డిపేట గ్రామం. మంచి కవి, అవధాని. ఎన్నో అవధానాలను నిర్వర్తించిన ఘనత వీరిది. సంస్కృతం, తెలుగులో రెండు, మూడు గ్రంథాలను రచించినారు. వీరు పుత్రులే గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి.

ప్రతిభకు పరీక్ష1. ఆగస్టులో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న రెండో భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఈ క్రీడలకు అర్హత సాధించిన మొదటి ఆటగాడు?


1) నీరజ్ చోప్రా, దేవేంద్ర ఝాజరియా
2) దేవేందర్ సింగ్, అభిరాజ్ ఠాకూర్
3) నీరజ్ చోప్రా, దేవేందర్ సింగ్
4) దేవేందర్ సింగ్, నీరజ్ చోప్రా

2. దేశంలో అతిపెద్ద బ్లాగ్ కాన్ఫరెన్స్ బ్లాగ్‌ఎక్‌ను కొనుగోలు చేసిన కంపెనీ?


1) టెక్‌మాగ్నెట్ 2) ఎవ్రీమీడియా
3) వాట్‌కన్సల్ట్ 4) సోషల్ వేవ్‌లెంత్

3. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ (ఎన్‌వైఐఎఫ్‌ఎఫ్)లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా?


1) పార్చుడ్ 2) ధనక్
3) ముక్తీ భవన్ 4) ఉమ్రిక

4. ఏ చిత్రానికిగాను న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్-2017లో ఉత్తమ దర్శకుడిగా కొంకణాసేన్‌శర్మ నామినేట్ అయ్యారు?


1) లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా
2) ఏ డెత్ ఇన్ ద గంజ్
3) ముక్తీ భవన్
4) యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్

5. మావోయిస్టులకు వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటించిన వ్యూహం సమాధాన్‌లో మొదట వచ్చే A అంటే?


1) యాక్షన్ ప్లాన్
2) యాక్షనబుల్ ఇంటెలిజెన్స్
3) అగ్రెసివ్ స్ట్రాటజీ
4) ఏదీకాదు

-సమాధానాలు మంగళవారం నిపుణలో...

-16వ తేదీ.. ప్రతిభకు పరీక్ష జవాబులు
-1-1, 2-2, 3-4, 4-2, 5-3, 6-1

279
Tags

More News

VIRAL NEWS