లా డిస్టెన్స్ కోర్సులు


Mon,July 17, 2017 12:43 AM

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
నేషనల్ లా స్కూల్‌లోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈ కోర్సులను అందిస్తుంది. 2017 -1 8 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాలు.
కోర్సులు: ఎంబీఎల్ - మాస్టర్ ఆఫ్ బిజినెస్ లా. ఇది రెండేండ్ల కాలవ్యవధి గల కోర్సు.
ఏడాది కాలపరిమితిగల డిప్లొమా కోర్సులు:
హ్యూమన్ రైట్స్ లా, మెడికల్ లా అండ్ ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లా, చైల్డ్‌రైట్స్ లా, సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్.
అర్హతలు: గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.nls.ac.in

ఎంఎస్‌ఎంఈలో పీజీ, పీడీ కోర్సులు


హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌రూమ్ పీజీ, పీడీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు
కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ పరిధిలో ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్ పనిచేస్తున్నది.
కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైనింగ్ అండ్ సీఏడీ/సీఏఎం
అర్హత: బీఈ లేదా బీటెక్ మెకానిక్ లేదా ప్రొడక్షన్ పూర్తిచేసి ఉండాలి.
పీజీ డిప్లొమా ఇన్ వీఎల్‌ఎస్‌ఐ & ఎంబెడెడ్ సిస్టమ్
అర్హత: బీఈ లేదా బీటెక్‌లో ఈసీఈ లేదా ట్రిపుల్ ఈ లేదా ఈఐఈ చేసి ఉండాలి.
MSME

పీజీ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్


అర్హత: బీఈ లేదా బీటెక్‌లో మెకానిక్ లేదా ఈసీఈ లేదా ట్రిపుల్ ఈ లేదా ఈఐఈ లేదా ఏరోనాటిక్స్ చేసి ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: ఏడాదిన్నర (మూడు సెమిస్టర్లు). పై మూడు కోర్సులకు.
పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్
అర్హత: డిప్లొమాలో మెకానిక్ లేదా ప్రొడక్షన్ చేసి ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: ఏడాది (రెండు సెమిస్టర్లు)
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: పీజీడీ కోర్సులకు రూ. 800, ఎస్సీ, ఎస్టీలకు రూ. 400; పీడీ కోర్సుకు రూ. 700, ఎస్సీ, ఎస్టీలకు 350. పీడబ్ల్యూడీలకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్. వెబ్‌సైట్‌లో నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా నింపి అవసరమైన దరఖాస్తులను జతచేసి కింది అడ్రస్‌కు పంపిచాలి.
అడ్రస్: Director (Trg), CITD, Balanagar, Hyderabad
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5
పరీక్ష తేదీ: ఆగస్టు 13
వెబ్‌సైట్: www.citdindia.org

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ కోర్సు


చెన్నైలోని అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ)లో సీఐటీఎస్ కోర్సులో ప్రవేశానికినోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
కోర్సు: క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రెయినింగ్
ట్రేడ్స్: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ (డీజిల్), ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, సూయింగ్ టెక్నాలజీ, టూల్ అండ్ డై మేకర్, వెల్డర్, ఫౌండ్రీమ్యాన్, వైర్‌మ్యాన్, రీడింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ అర్థమెటిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్).
అర్హతలు: సంబంధిత బ్రాంచీ/ట్రేడ్‌లలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: సీఐటీఎస్‌లో ఎంపిక కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా చేస్తారు.
ఎంట్రెన్స్ టెస్ట్: ఆగస్టు 12
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 26
వెబ్‌సైట్: http://citsadmission.atichennai.org.in

509
Tags

More News

VIRAL NEWS