మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలు


Tue,January 22, 2019 01:23 AM

Rashtriya-Military-School
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

- ప్రవేశాలు: 8వ తరగతిలోకి
- అర్హత: 2020, జనవరి 1 నాటికి ఏడోతరగతి ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడోతరగతి చదువుతున్న బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: 2020, జనవరి 1 నాటికి 11 1/2 ఏండ్ల నుంచి 13 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2007, జనవరి 2 - 2008, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
- ప్రవేశపరీక్ష తేదీలు: జూన్ 1, 2
- పరీక్ష విధానం: పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. దీనిలో ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులను జూన్ 1న, జనరల్ నాలెడ్జ్ పేపర్‌ను జూన్ 2న నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో కనీస అర్హత మార్కులు 50 శాతం.
- రాతపరీక్షలో అర్హత సాధించినవారికి అక్టోబర్ 4న వైవా వాయిస్ నిర్వహిస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులు 50 శాతం. ఇంటర్వ్యూలో విద్యార్థి ఇంటెలిజెన్సీ అండ్ పర్సనాలిటీని పరీక్షిస్తారు.
- పై అన్నింటిలో అర్హత సాధించినవారికి చివరగా వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వైద్యపరంగా ఫిట్ అయినవారికి ప్రవేశాలు కల్పిస్తారు.
- పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్.

- ఫీజు: ఆర్‌ఐఎంసీలో ఏడాదికి రూ.42,400/- చెల్లించాలి. రిఫండబుల్ డిపాజిట్ కింద రూ.20 వేలు చెల్లించాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఈ రుసుమును తిరిగి ఇస్తారు.
- స్కాలర్‌షిప్స్: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభావంతులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ కింద ఏటా రూ.10 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్‌షిప్‌ను ఇస్తాయి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.555.
- చివరితేదీ: మార్చి 31
- వివరాలకు Secretary, Telangana State Public Service Commission, Prathibha Bhavan, M.J.Road, Nampally, Hyderabad 500001, Telangana(India)లో సంప్రదించవచ్చు.
- వెబ్‌సైట్: https://tspsc.gov.in

832
Tags

More News

VIRAL NEWS