మరుగున పడిన మన రచయితలు


Sun,August 14, 2016 01:40 AM

12వ తేదీ తరువాయి...

ధవళ శ్రీనివాసరావు (1918-80) : నల్లగొండ జిల్లా చం డూరు మండలం కోటయ్యగూడెంలో జన్మించారు. చం డూరు సాహితీ మేఖల మూలస్థంభాల్లో ఒకరు. వీరి రచనలు ధవళశ్రీ (ఖండకావ్యం). నీలగిరి సారస్వత సమితి స్థాపించబడి యువ రచయితల సంకలనం తొలిసంజ పేరున వెలువడింది.

-మద్దోజు సత్యనారాయణ : 1930లో చండూరులో జననం. 1991లో మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీ మేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.

-ముడుంబ సీతారామానుజాచార్యులు : 16-6-1916న హుజూర్‌నగర్ మండలం బూరుగుగడ్డలో జన్మించారు. సంగీత విద్వాంసులు, కవి సముద్రాల రాఘవాచార్యులు వద్ద భక్తకుచేల, ఋష్యశృంగ, సత్యనారాయణ మహత్మ్యం వంటి సినిమాలకు నేపథ్యగానం అందించారు. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సముద్రాల, పి. నాగేశ్వరరావు వంటి వారితో వీరికి పరిచయం ఉంది. సాహితీ మేఖల వార్షికోత్సంలో ఇతని శిక్షణలో ప్రదర్శితమైన నాటకాలు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావుల ప్రశంసలందుకున్నాయి.

-పులిజాల హనుమంతరావు : 1919లో కొండాపురంలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల మూలస్థంభం. ఇతను సాహితీ మేఖల ప్రచురించిన పుస్తకాలకు అమూల్యమైన పీఠికలు రాశారు.

-పాంపాటి చినహనుమంతు గుప్త : 20-10-1916లో చం డూరులో జన్మించారు. సాహితీ మేఖలకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అస్పృశ్యులు (పద్యకవిత), ఉష:కిరణాలు (కవితాఖండిక) రచించారు. ఇతను అంబటిపూడి వెంకటరత్నం శిష్యులు.

-రామడుగు శ్రీమన్నారాయణ శర్మ : 17-7-1935లో కనగల్ మండలం చిన్న మాధవరంలో జన్మించారు. ముట్నూరి కృష్ణారావు జీవితం - సాహిత్యం రచించారు. సాహితి మేఖల సౌజన్యంతో రాగవీణ ప్రచురితమైంది.

-పాశం నారాయణరెడ్డి (1909-82) : మర్రిగూడ మండలం ఖుదాభక్ష్‌పల్లిలో జన్మించారు. వీరి రచనలు త్యాగమూర్తులు, సాధుమూర్తులు, బంగ్లాదేశ్ (బుర్రకథ), దయానంద్ సరస్వతి (బుర్రకథ), సత్రాజాతీయం(వీధినాట కం), సదాశివరెడ్డి పద్యకావ్యం (1990), భారతదేశ చరిత్ర (బతుకమ్మపాట)లాంటివి రాశారు. ఇతను పదోప్రాయం నుంచే కవిత్వం మొదలుపెట్టారు.

-సిరిప్రగత భార్గవరావు (1923-55) : నల్లగొండ జిల్లాలోని కస్తాలలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల వ్యవస్థాపక శిష్యుల్లో ఒకరు . ఇతని రచన భార్గవానందలహరి. సాహితీ మేఖల వెంకటరత్నం, భార్గవరావుల మధ్య అవినాభావ సంబంధం గల వ్యక్తులు- సంస్థలు. ఇతను కవి, స్వాతంత్య్ర సమరయోధులు.

-పులిజాల గోపాలరావు (1910-89) : చండూరు మండలంలోని దొనిపాములలో జన్మించారు. ఇతను సాహితీ మేఖ ల నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక స్థితిని కలిగించిన వారిలో ఒకరైన మంచికవి. ఖడ్గతిక్కన, వియోగతీతి, శతకమంజరి, రామచంద్రప్రభూ శతకం, ధర్మజీవన్ (నాటకం), కష్టజీవి, స్మృత్యాంజలి, శ్రీరామ శతకం, శ్రీవెంకటేశ్వర శతకం, విజయ భాస్కరం (నాటకం), పల్లె బ్రతుకు, తెలుగుపొలము లాంటి రచనలు చేశారు.

-ఏలె ఎల్లయ్య (1904-90) : నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో జన్మించారు. ఇతను సాహితీ మేఖల సభల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు పొందిన కవి. వీరికి కవిరాజు సిద్ధాంత శిరోభూషణ బిరుదు కలదు. చిన్నవి పెద్దవి కలిపి 50 గ్రంథాలు రాశారు. బీదరైతు, సీతాకళ్యాణం, సాంఘిక నాటకం, ఆంధ్రశబ్దమంజరి, హిందూవివాహనిధి, ఏలెవాస్తు, భృగువంశం, మార్కండేయ సుప్రభాతం,కర్ణవధ, కులం తదితర రచనలు రాశారు. ఈయన జీవితంపై కూరెళ్ల విఠలాచార్య గ్రంథం రాశారు.

-నాగార్జున కనకాచారి : 1929లో నల్లగొండ మండలం దో మలపల్లిలో జన్మించారు. ఇతని రచనలు నల్లగొండ పిచ్చోడు, కాలజ్ఞానం, మేలుకొలుపు, ఇంకా నైజాం విప్లవ పోరా ట చరిత్ర, కోదాడ రజాకార్ చిచ్చు, విప్లవ ఢంకా (బుర్రకథలు)కూడా రాశారు. ఇతను ఆయుర్వేద వైద్యులు కూడా.

-ఆచార్య జయధీర్ తిరుమలరావు : 1950లో వరంగల్‌లో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉన్న సాహిత్యాన్ని, కళారూపాల్ని వెలికి తేవాలన్న ఆలోచనతో పరిశోధన కృషి కొనసాగిస్తున్నారు. తెలంగాణ రైతాంగపోరాటం, ప్రజాసాహిత్యం, ప్రజాకళారూపాలు, డాక్యుమెంటరీ సినిమా, దళిత గేయాలు, స్త్రీవాద కథలు, జానపద చారిత్రక గేయ కథలు రచనలు రాశారు. ఇతను తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, తెలుగు అకాడమిలో పరిశోధక శాఖలో కూడా పనిచేశారు.

@ ఆచార్య పేర్వారం జగన్నాథం : 23-8-1934లో వరంగల్ జిల్లా ఖిలాషాపురం మండలం సర్వాయి పాపన్న ఉన్న గ్రామంలో జన్మించారు. వృషభపురాణం, సాగర సంగీ తం, గరుడపురాణం, ఆరె జానపదుల గాథలు, సర్వాయి పాపన్న గ్రంథాలను రచించారు. ఇతను తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేశారు.

-సి.హెచ్ రాజేశ్వరరావు: 10-8-1923లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా మాదిపాడులో జన్మించారు. ఇతను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని 6 నెలలు జైలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. 1957,62,72 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి రచయిత కూడా.

-పుచ్చా పరబ్రహ్మశాస్త్రి : 1921,జూన్‌లో జన్మించారు. ఇతని స్వస్థలం గుంటురు జిల్లా తెనాలి అయినప్పటికీ, తెలంగాణ పరిశోధనకే తన జీవితాన్ని అంకితం చేశారు. బ్రహ్మలిపి తెలిసిన చరిత్రకారుడు. సంస్కృతం, కన్నడ భాషల్లోని శాసనాలను చదవగలరు. ఇతను కనుగొన్న శాసనాల్లో కాకతీయ గణపతి చక్రవర్తి బయ్యారం చెరువు శాసనం ముఖ్యమైంది. కాకతీయుల చరిత్రపై పరిశోధన చేశారు. రుద్రమ్మ మరణ శాసనం - చందుపట్ల (1289)ను నల్లగొండ జిల్లా లో కనుగొన్నారు. కాకతీయ శాసన సాహిత్యంతో పాటు తదితర పద్య శాసనాల గ్రంథాలు రాశారు. ది కాకతీయాస్ అండ్ దేర్ టైమ్స్ అంశంపై పీహెచ్‌డీ కూడా చేశారు.
Newspaper

తెలంగాణ నుంచి వెలువడిన పత్రికలు


కాకతీయ - పాములపర్తి సదాశివ, వరంగల్
జనధర్మ, వరంగల్ వాణి (దినపత్రిక)
విశ్వజ్యోతి (1968)- వరంగల్ నుంచి వెలువడింది. ఇది తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఒక చారిత్రక పత్రం గా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.
విద్యుల్లత- జమ్మికుంటలో ప్రారంభమైంది
జీవగడ్డ (దినపత్రిక)- కరీంనగర్
1968లో బైస రాందాసు మహబూబ్‌నగర్, నిజామాబాద్ నుంచి వెలుగు పత్రికను నడిపారు.
మషీర్-ఎ-దక్కన్ (దినపత్రిక)- ఎం. హనుమంతరావు
ఇమ్రోజ్ - షోయబుల్లాఖాన్. (రజాకార్లు ఈయనను హైదరాబాద్‌లో హత్యచేశారు)
హితబోధిని - బీ శ్రీనివాసశర్మ, బీ రామచంద్రరావు 1913, జూన్ 13న స్థాపించారు. ఇది మహబూబ్‌నగర్ నుంచి వెలువడింది. ఆత్మకూరు సంస్థానాధీశులు ఈ పత్రిక ముద్రణా యంత్రం కోసం ఆర్థిక సహాయం చేశారు.
తెనుగు - ఒద్దిరాజు సోదరులు రాఘవరంగారావు, సీతారామచంద్రరావులు 1922, ఆగస్టు 27న వరంగల్‌లోని ఇనుగుర్తిలో స్థాపించారు.
ఆంధ్రాభ్యుదయం (1925) - హన్మకొండ
దేశబంధు (1926)- బెల్లంకొండ నరసింహాచార్యులు
తరణి (1942)- సుబ్బరాయసిద్ధాంతి, సికింద్రాబాద్
శోభ (1947)- దేవులపల్లి రామానుజరావు
గ్రామజ్యోతి (గోడ పత్రిక)- బొబ్బల ఇంద్రసేనారెడ్డి, వరంగల్ జిల్లా జనగామ తాలూకా గూడూరులో నడిచింది. ప్రభుత్వానికి రూ. 50 జరిమానా కట్టిన మొదటి పత్రిక.
తెలంగాణ (1941-42)- బుక్కపట్నం రామానుజాచార్యులు. తెలంగాణలో వెలువడిన తొలి దినపత్రిక
దక్కన్ క్రానికల్ (1937- ఆంగ్లపత్రిక)- కే రాజగోపాల్, బుక్కపట్నం రామానుజాచార్యులు, హైదరాబాద్
కాంగ్రెస్ (వారపత్రిక)- 1956- దేవులపల్లి సుదర్శన్‌రావు, వరంగల్
ఆంధ్రశ్రీ (త్రైమాసిక పత్రిక)- 1944- సికింద్రాబాద్ నుంచి వెలువడింది. ఇది ఆంధ్రమహాసభకి చెందింది.
తెలుగుతల్లి- 1941- రాచమల్లు సత్యవతీదేవి (సంపాదకులు), సికింద్రాబాద్
భాగ్యనగర్- 1949- అయోధ్య రామకవి (సంపాదకులు), హైదరాబాద్
ఆంధ్రసారస్వత్ పరిషత్ పత్రిక- 1940- హైదరాబాద్
విద్యార్థివాణి- 1955- కేఎం నరసింహారావు
మీజాన్- కలకత్తాకు చెందిన గులాం మహ్మద్ స్థాపన.
సృజన (1966)- కాళోజీ సంపాదకత్వంలో నాలుగేండ్ల పాటు వెలువడింది. తరువాత నవీన్, అనంతరం విప్లవకవి వరవరరావు నడిపారు. 1973లో అరెస్టవడంతో ఆయన భార్య హేమలత నడిపారు.
జనధర్మ (1958)- ఎంఎస్ ఆచార్య
సుజాత- తెలుగువారి ఆడబిడ్డగా 1927లో వెలువడింది.
వరంగల్ వాణి (1980)- ఎంఎస్ ఆచార్య, ఇది 1994 వరకు నడిచింది.
మానుకోట (వారపత్రిక)- సీబీ లక్ష్మి, వరంగల్

కొన్ని పత్రికలు - ప్రారంభకులు


సత్యార్థ ప్రకాశిక - మంత్రి ప్రగడ వెంకటేశ్వర్రావు (1887-1993), లింగగిరి వాసి
గ్రామ వెలుగు (1942)- లక్ష్మీ నరసింహారావు (కేఎల్‌ఎన్ రావు), రేపాల
ప్రగతి, బాల సరస్వతి- కోదాటి నారాయణరావు, రేపాల నుంచి నడిపారు.
తొలి వెలుగు (వారపత్రిక)- పెరికె రాజారత్నం, పానుంగంటి నరసింహారావు
విశ్వాభ్యుదయ (మాస పత్రిక), వేదిక- జగిని ఆదినారాయణ గుప్త, కోదాడ
సాహితీ మేఖల- పున్న అంజయ్య (సంపాదకులు- 1993 నుంచి)
నీలగిరి (1922, ఆగస్టు 24)- షబ్నవీసు వెంకటరామ నరసింహారావు
విశ్వప్రకాశ- సూర్యాపేట నుంచి
ఉజ్వల- సంపాదకులు ఎన్ నరేందర్ రెడ్డి
సాహితీ మిత్ర (మాస పత్రిక)- సంపాదకులు సుతారి శివసుబ్రహ్మణ్యం, మిర్యాలగూడెం నుంచి వెలువడింది
మూసీ (మాసపత్రిక)- బీఎన్ శాస్త్రి, 1981 నుంచి ఆరేండ్ల పాటు నడిచింది
తెలుగు పరిశోధన- ఎన్ గోపీ, హైదరాబాద్ నుంచి నడిపారు
స్పందన (మాస పత్రిక)- మిర్యాలగూడెం నుంచి
ప్రపంచ శాంతి- వసంతరాయ్, మిర్యాలగూడెం నుంచి
దర్పణం- దీనిని జిల్లా రచయితల సంఘం స్థాపించింది
నాగార్జునవాణి- హుజూర్ నగర్ నుంచి వెలువడింది
ఆబ్కారీ సమాచార్- చెఱుకు ఉషాగౌడ్ సంపాదకత్వంలో గుడ్రాంపల్లి నుంచి వెలువడింది
భృగుభేరి- పున్న ఎల్లప్ప స్థాపించారు, సిరిపురం (రామన్నపేట)
తేజోప్రభ (1980)- దేవులపల్లి ప్రభాకర్‌రావు సంపాదకులు, సూర్యాపేట నుంచి వెలువడింది.
షాడో- బీ రాజు నల్లగొండ నుంచి నడిపారు
మూఢ విశ్వాసాలు- ఎస్ జగన్నాథం స్థాపించారు. నల్లగొండ
ప్రతిధ్వని (1972)- కొమర్రాజు మురళీధర్ రావు, ఇది నల్లగొండ నుంచి వెలువడిన పక్షపత్రిక
విపంచి- చెన్నూరి హనుమంతారావు హుజూర్‌నగర్ నుంచి నడిపారు
ప్రజాపోరు (1987)- యూసఫ్ బాబు సంపాదకులు
రయ్యత్ (1927)- మందుముల నరసింగరావు, ఇది ఉర్దూపత్రిక. దీనిని నిజాం ప్రభుత్వం 1929లో నిలిపివేసింది. మళ్లీ 1932లో పింగళి వెంకట రామిరెడ్డి సహాయంతో మొదలైంది.

తెలంగాణలో పత్రికోద్యమం


గ్రంథాలయోద్యమానికి తోడుగా తెలంగాణలో పత్రికోద్యమం కొనసాగింది. ప్రజలను జాగృతం చేసిన ఉద్యమాల్లో పత్రికల పాత్ర ప్రధానమైంది. తెలంగాణలో స్థాపితమైన తొలి తెలుగు పత్రిక శౌర్య చంద్రిక (1880లో). అనంతరం హితబోధిని, తెలుగు, నీలగిరి, గోలకొండ, సారస్వత, సుజాత, దేశబంధు, విభూతి, భాగ్యనగర్, తెలంగాణ, మీజాన్ మొదలైన దిన, అర్ధవార, వార, పక్ష, మాస పత్రికలు ప్రజల్లో చైతన్యానికి కృషిచేశాయి. వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు కలిసి 1922, ఆగస్టు 27న తెలుగు దినపత్రికను స్థాపించారు. ఇది ఐదేండ్ల పాటు నడిచింది. షబ్నవీసు వెంకటరామ నర్సింహారావు నల్లగొండలో నీలగిరి పత్రికను నడిపారు. అయితే తెలుగువారి మొదటి పత్రిక కర్నాటిక్ క్రానికల్ 1832లోనే వెలువడింది.

గోలకొండ- సురవరం ప్రతాపరెడ్డి. 1926, మే 10న ప్రారంభమైంది. 25 ఏండ్లపాటు వెలువడింది. 1966, ఆగస్టు 22న మూతపడింది. దీని తొలి పెట్టుబడి రూ. 75 వేలు.
సురవరం ప్రజావాణి పత్రికను ప్రారంభించడానికి ప్రయత్నించారు. కానీ అది నిలవలేదు.
lingamurthy

1600
Tags

More News

VIRAL NEWS