బోధన ఉద్దేశాలు


Fri,June 16, 2017 01:12 AM

ఇది శాస్త్రసాంకేతిక యుగం. మనం మన జీవితాలను నిరంతరం సుఖమయం చేసుకోవడానికి విజ్ఞానశాస్త్రంపై ఆధారపడుతున్నాం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఇందుకు ప్రబల నిదర్శనం.
విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులు విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలను, లక్ష్యాలను, విలువలను దృష్టిలో పెట్టుకొని తన కృత్యాలను, ప్రయోగాలను ప్రదర్శించాలి.

Teaching
విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం
-ఉద్దేశమనేది మన కళ్ల ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశనం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం.

-బోధనోద్దేశం- నిర్వచనం: విజ్ఞానశాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం అంటారు.
-రెడిన్ నిర్వచనం: నేటి విద్య ద్వారా సాధించాల్సిన గమ్యాల్లో ఒక సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడం. ఈ గమ్యాన్ని విద్య ఉద్దేశంగా భావించవచ్చు. కాబట్టి ఉద్దేశాన్ని ఒక ప్రక్రియ ద్వారా సాధించాల్సిన గమ్యాలు లేదా ఒక ప్రక్రియ అంతిమ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.
-ఉద్దేశాలకు, గమ్యాలకు మధ్య స్వల్ప తేడాను సూద్ తెలిపాడు. గమ్యాలనేవి ప్రయోజనాల నుంచి ఏర్పర్చుకొనేవి. గమ్యాల నుంచి కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఎన్నుకొనే వాటిని ఉద్దేశాలు అంటారు.

ఉద్దేశాలు- లక్షణాలు


-ఆశయాలు సామాజిక అవసరాలు, మార్గదర్శక లక్షణాలు కలిగి ఉండాలి.
-దీర్ఘదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి.
-దీర్ఘకాలిక గమ్యంగా ఉండాలి.
-విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలను జాతీయ విజ్ఞానశాస్త్ర అధ్యాపకుల సంఘం 1961లో ఈ విధంగా పేర్కొంది.
-విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని గురించిన మౌలిక జ్ఞానాన్ని కలిగించడం.
-గణితశాస్త్ర, పరిశీలన, ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంపొందించడం.
-విజ్ఞానశాస్ర్తానికి, సమాజానికి గల సంబంధాలను అవగాహన చేసుకోవడం.
-విజ్ఞానశాస్త్రంలోని వివిధ శాఖలను, అంశాలను సమన్వయపర్చడం, విజ్ఞానశాస్ర్తాన్ని వివరించే భావనలు, సిద్ధాంతాలపై అవగాహనను పెంపొందించడం.
-ప్రొఫెసర్ బీ షారన్ (NCERT 1980) విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలను ఈ విధంగా పేర్కొన్నారు.
-విజ్ఞానశాస్త్ర అంశాల్లో ముఖ్యంగా జీవకేంద్రీకృత, పరిసరాల ఆధారిత అంశాలను తెలియపరుచడం.
-సమస్యల సాధనలో తోడ్పడిన శాస్త్రీయ పద్ధతిని వక్కాణించడం.
-శాస్త్రీయ పరికరాలను ఉపయోగించడం, నిర్వహణలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం.
-విద్యార్థులను సృజనాత్మకంగా తయారుచేయడం
-విశాల భావాలు గల మానసిక శక్తిని పెంపొందించడం. జీవితంలో మార్పులకు విద్యార్థులను సిద్ధం చేయడం.
-విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, విలువలు సక్రమంగా ఉండాలంటే విద్యార్థి అవసరాలు, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి.

సమాజ అవసరాలు


-బోధనాంశం స్వరూప స్వభావాలు
-విద్యావ్యవస్థ స్వభావం
-ఉపయోగ విలువ (వినియోగ విలువ)
-సమకాలీనత, క్రమంగా ఉన్నత, విశాల లక్ష్యాలను చేర్చేదిగా ఉండాలి.
-విద్యార్థుల మేధస్సుకు, పరిపక్వతకు తగినట్లుగా ఉండాలి.
-అభ్యసనకు, పరిస్థితులు ఆచరణాత్మకంగా ఉండాలి.
-విలియం జే జాకబ్‌సన్ ప్రకారం ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనతో నెరవేరే ఉద్దేశాలు..
1. స్వాభావిక ప్రపంచం గురించి దృష్టిని వృద్ధి పరచడం: విద్యార్థులు పరిసరాలను, దృగ్విషయాలను పరిశీలిస్తారు. పోలికలను భేదాలను గుర్తిస్తారు.
2. విశాలమైన శాస్త్ర సాధరణీకరణాలను అభివృద్ధి చేయడం: విద్యార్థులు పాఠ్యాంశాల్లో అనేక సాధారణీకరణాలను తెలుసుకుంటారు.
3. విజ్ఞానశాస్త్ర ప్రక్రియలు, పద్ధతులను వినియోగించడంలో నైపుణ్యాన్ని పెంపొందించడం: విజ్ఞానశాస్త్రం ఒక ప్రక్రియ. ఇది అనేక పద్ధతులతో కూడుకొని ఉంది. విద్యార్థులు ప్రయోగాలు నిర్వహించడం, పరిశీలనలు చేయడంలో ప్రావీణ్యత సంపాదిస్తారు.

4. ఆదర్శ పౌరుడిగా తయారుచేయడం: విజ్ఞానశాస్త్ర విషయాల బోధన విద్యార్థుల్లో యథార్థ పరిస్థితులు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పిస్తుంది.
5. మానవ దేహం, దాని సంరక్షణ గురించిన అవగాహన పెంపొందించడం:
-విజ్ఞానశాస్త్ర అధ్యయనం వల్ల శరీరనిర్మాణం అది పనిచేసే విధంగా దానిలో ఇమిడి ఉన్న సూత్రాలు, పాటించాల్సిన నియమాల గురించి విద్యార్థులు తెలుసుకుంటారు.
-దేహసంరక్షణ, వ్యాధులు రాకుండా నివారించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
6. శాస్ర్తాభివృద్ధిలో భాగస్వామ్యం వహించే సామర్థ్యాన్ని పెంపొందించడం:
-శాస్త్రరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను తెలుసుకుంటారు.
-జీవశాస్త్రంలో ప్రతిసృష్టి చేయడానికి ప్రయోగాలు చేస్తుంటారు.
7. విజ్ఞానశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించడం: విజ్ఞానశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో శాస్ర్తానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించడం. దీనివల్ల విద్యార్థులు నిత్య జీవితంలో విజ్ఞానశాస్ర్తాన్ని వినియోగించుకుంటారు.

8. శాస్త్రవేత్తల కృషిని ప్రదర్శించడం: విజ్ఞానశాస్త్ర బోధనతోపాటు దానివెనుక కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి చెప్పాలి.
-వీటితోపాటు విజ్ఞానశాస్త్రం కింది బోధనోద్దేశాలను కూడా కలిగి ఉన్నది.
1. విమర్శనాత్మక వైఖరి, శాస్త్రీయ వివేచనను వృద్ధి చేయడం: శాస్త్రీయ దృగ్విషయాలకు సంబంధించిన వివరణలను విజ్ఞానశాస్త్రం అందజేస్తుంది. ఇది శాస్త్రీయ వివేచనను వృద్ధి చేస్తుంది.
2.పర్యావరణం గురించి చైతన్యాన్ని అభివృద్ధి చేయడం:
-మానవుడు పర్యావరణంలో ఒక భాగం. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాడు. కాబట్టి పరిసరాలను గురించి తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మానవుడికి ఉన్నది.
-పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్రను పోషించాలి.

-విజ్ఞానశాస్త్ర విలువలు: మనం ఉపయోగించే ప్రతి వస్తువు, ప్రతి పనిముట్టు విజ్ఞానశాస్త్రం ప్రసాదించిన వరమే.
-సాంఘిక విలువ
-క్రమశిక్షణా విలువ
-ఉత్తేజాన్ని కలిగించే విలువ
-సృజనాత్మక విలువ
-వివరణాత్మక విలువ
-ఉన్నతవిద్యకు, వృత్తి విద్యకు భూమిక
-ఉన్నత జీవితానికి భూమిక
-నైతిక విలువ
-సాంస్కృతిక విలువ
-సౌందర్యాత్మక విలువ
-బౌద్ధిక విలువ
-విరామ సమయ వ్యాపకం

940
Tags

More News

VIRAL NEWS