బిట్‌శాట్ 2019 ప్రవేశాలు


Tue,January 15, 2019 03:44 AM

రాజస్థాన్ (పిలానీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనుబంధ క్యాంపస్‌లల్లో 2019 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాల కోసం బిట్‌శాట్-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
bits-pilani
-క్యాంపస్‌లు: పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్‌లలో బీఈ/, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
-బీఈ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్&ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ)
-బీ ఫార్మసీ
-ఎమ్మెస్సీ (బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఎమ్మెస్సీ జనరల్ స్టడీస్.

అర్హతలు:

-బీఈ, ఎమ్మెస్సీ కోర్సులు: ఇంటర్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో 75 శాతం మార్కులతోఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి.
-బీ ఫార్మసీ కోర్సు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్)లో 60 శాతం మార్కులతోఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి.
గమనిక: 2018లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా 2019లో ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-కేంద్ర/రాష్ట్రాల బోర్డు పరీక్షలో మొదటి ర్యాంకులు పొందిన విద్యార్థులకు బిట్‌శాట్‌కు సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్ కల్పిస్తారు.
-ఎంపిక విధానం: బిట్‌శాట్-2019 స్కోర్ ద్వారా
-బిట్‌శాట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు, మూడుగంటల్లో పూర్తిచేయాలి.
-పార్ట్ 1 ఫిజిక్స్-40 ప్రశ్నలు
-పార్ట్ 2 కెమిస్ట్రీ-40 ప్రశ్నలు
-పార్ట్ 3 ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ-15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్-10 ప్రశ్నలు
-పార్ట్ 4 మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ (బీ ఫార్మసీ అభ్యర్థులు)-45 ప్రశ్నలు
-అప్లికేషన్ ఫీజు: రూ.3150/-(పురుషులు), రూ.2650/-(మహిళలు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 20
-వెబ్ సైట్: www.bitsadmission.com

851
Tags

More News

VIRAL NEWS