ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా

Mon,March 20, 2017 01:21 AM

IIP
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీడీపీసీఈటీ) -2017 నోటిఫికేషన్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విడుదల చేసింది.

వివరాలు:


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. దీన్ని మొదట 1966లో ముంబైలో ప్రారంభించారు.
-ఐఐపీ రీజినల్ సెంటర్స్ కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్నాయి. ఐఐపీల్లో ట్రెయినింగ్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, ప్రాజెక్టులు, ఆర్ అండ్ డీ, ప్యాకేజింగ్ టెస్టింగ్, క్వాలిటీ ఎవాల్యుయేషన్‌లు ఇక్కడ జరుగుతాయి.
-కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
ఇది రెండేండ్ల ప్రోగ్రామ్.
-అర్హతలు: 2017, మే 31 నాటికి 30 ఏండ్లు మించరాదు.
-ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-10+2 లేదా ఇంటర్ తర్వాత మూడేండ్ల ఫుల్‌టైం సైన్స్ డిగ్రీ చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీలు ప్రధాన సబ్జెక్టులుగా చదివినవారు అర్హులు లేదా మూడేండ్ల డిగ్రీలో అగ్రికల్చర్/ ఫుడ్ సైన్స్ లేదా పాలీమర్ సైన్స్ లేదా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీల్లో కనీసం సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణత.
-ఎంపికవిధానం: రెండు దశల్లో జరుగుతుంది.
-రాతపరీక్ష , వ్యక్తిగత ఇంటర్వ్యూ
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. డిగ్రీస్థాయిలో చదివిన సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది.
-పరీక్షతేదీ: జూన్ 16
-పరీక్షకేంద్రాలు: ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్
-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
-సీట్ల వివరాలు: ముంబై - 280, ఢిల్లీ - 100, కోల్‌కతా - 80, హైదరాబాద్ - 40
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా ఐఐపీ కార్యాలయాల్లో లభిస్తాయి.
-చివరితేదీ: జూన్ 9
-వెబ్‌సైట్:

http://www.iip-in.comఐఐటీలో పీజీ కోర్సులు


ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ (ఐఐటీబీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:


2017-18 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు.
కోర్సులు:
-ఎంటెక్, ఎంటెక్ + పీహెచ్‌డీ (డ్యూయల్ డిగ్రీ)
పీహెచ్‌డీ
-ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ ఇన్ ఎనర్జీ
-దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 17,18
ఎంఫిల్
-దరఖాస్తుకు చివరితేదీ: మే 6
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్:

www.iitb.ac.inఐఐఐటీలో ప్రవేశాలు


హైదరబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:


పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ - పీజీఈఈ 2017
దీనిలో భాగంగా ఎంటెక్/ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎంఈ లేదా బీఆర్క్, పీజీ డిగ్రీలో సైన్స్ లేదా మ్యాథ్స్ లేదా ఐటీ, కంప్యూటర్, ఎంసీఏ ప్రోగ్రామ్స్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-పరీక్షతేదీ: ఏప్రిల్ 30
-దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31
నోట్: వీటితోపాటు స్ప్రింగ్ అడ్మిషన్స్ (పీహెచ్‌డీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రామ్, స్టాండింగ్ కమిటీ అడ్మిషన్స్.
-అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ - 2017
-బీటెక్‌లోకోర్సుల కోసం సీఎల్‌డీ, సీఎన్‌డీ పద్ధతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
-పరీక్షతేదీ: ఏప్రిల్ 30
-దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31
-పై కోర్సులతోపాటు లేటరల్ ఎంట్రీ ద్వారా డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాలు, ఇంటర్ తర్వాత ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
-పూర్తి వివరాల కోసం
-వెబ్‌సైట్:

www.iiit.ac.in/admissions,

442
Tags

More News

మరిన్ని వార్తలు...