నిమ్‌సెట్ - 2017

Mon,March 20, 2017 01:17 AM

-నేడే చివరితేదీ
-ఎంసీఏలో ప్రవేశాలు
-రాతపరీక్ష ద్వారా ఎంపిక

నిమ్‌సెట్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇది.
వివరాలు: ప్రవేశాలు కల్పించే నిట్‌లు: వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి.
NIMCET_Exam
కోర్సు: మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ (ఎంసీఏ)
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏతో మూడేండ్ల బీఎస్సీ/ బీఎస్సీ (ఆనర్స్) లేదా బీసీఏ లేదా బీఐటీ కోర్సులో ఉత్తీర్ణత. డిగ్రీలో మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా తత్సమాన సబ్జెక్టు కలిగి ఉండాలి. లేదా బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు చదివినవారు అర్హులు.
-పరీక్ష విధానం: 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
-పరీక్షలో మ్యాథ్స్ -50, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ - 40, కంప్యూటర్ అవేర్‌నెస్ - 10, జనరల్ ఇంగ్లిష్ - 20 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 31 కేంద్రాల్లో నిర్వహిస్తారు. రాష్ట్రంలో వరంగల్
-సీట్ల వివరాలు: అగర్తలా - 40, అలహాబాద్ - 93, భోపాల్ - 92, కాలికట్ - 46, దుర్గాపూర్ - 40, జంషెడ్‌పూర్ - 92, కురుక్షేత్ర - 60, రాయ్‌పూర్ - 92, సూరత్‌కల్ - 92, తిరుచిరాపల్లి - 92, వరంగల్ - 46 సీట్లు ఉన్నాయి. వీటికితోడు కురుక్షేత్రలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో 30 సీట్లు ఉన్నాయి.
-మొత్తం సీట్ల సంఖ్య - 815
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 20, పరీక్షతేదీ: మే 28
-వెబ్‌సైట్: https://nimcet2017.nitdgp.ac.in

397
Tags

More News

మరిన్ని వార్తలు...