దూరవిద్యలో బీఈడీ


Mon,January 14, 2019 01:36 AM

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (ఎస్‌డీఎల్‌సీఈ) బీఈడీ (డీఎం) ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
Kakatiya-University
-కోర్సు: బీఈడీ (డిస్టెన్స్ మోడ్)
-విద్యాసంవత్సరం: 2018-20 (ఇది రెండేండ్ల (వేసవి సెలవుల్లో) కాలవ్యవధిగల కోర్సు).
-స్టడీ సెంటర్లు: వరంగల్ (ఎస్‌డీఎల్‌సీఈ, కేయూ, వరంగల్), ఏకశిల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-జనగామ, అనిబీసెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఖమ్మం, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-పెద్దపల్లి, పంచశీల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్-నిర్మల్.
అర్హతలు:
-బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ/ఎయిడెడ్ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో కనీసం రెండేండ్లు బోధనా అనుభవం (2019, జనవరి 31 నాటికి) తప్పనిసరి. తెలంగాణ ప్రాంత పరిధిలోని పాఠశాలల్లో పనిచేసినవారికి మాత్రమే. బీఏ/బీకాం లేదా బీఎస్సీతోపాటు టీటీసీ ఉత్తీర్ణులై ఉండాలి. కేయూ నిర్వహించే బీఈడీ ఎంట్రెన్స్‌లో అర్హత సాధించాలి. 85 శాతం సీట్లను కేయూ పరిధిలోని లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను లోకల్/నాన్‌లోకల్‌కు కేటాయిస్తారు.
-ప్రవేశాలు కల్పించే పద్ధతి: ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత, సర్వీస్ సీనియారిటీ ఆధారంగా మొత్తం 500 సీట్లను భర్తీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి.
-మెథడాలజీలు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్.
-కౌన్సెలింగ్ తేదీలు:
-మ్యాథ్స్, ఫిజిక్స్- ఫిబ్రవరి 26
-బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్- ఫిబ్రవరి 27
నోట్: కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు ఒరిజినల్, జిరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలి.
-ఫీజు: కౌన్సెలింగ్ సమయంలో రూ. 25వేల డీడీని డైరెక్టర్, ఎస్‌డీఎస్‌సీఈ, కేయూ పేరిట తీయాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జనవరి 25
-రూ.200 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 2లోగా దరఖాస్తులు దాఖలు చేయాలి.
-ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 18
-పూర్తి వివరాలకు 0870-2438877, 2438899లో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: http://www.sdlceku.co.-n

807
Tags

More News

VIRAL NEWS