తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు


Tue,April 26, 2016 12:54 AM

దక్కన్ పీఠభూమిలో నెలవై ఉన్న తెలంగాణ అనేక నదులతో అలరారుతున్నప్పటికీ వాటిలోని నీటిని నేటివరకు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. అరకొర ప్రాజెక్టులతో అతికొద్ది భూభాగానికి మాత్రమే సాగునీరు అందుతుండటంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తీవ్ర వెనుకబాటుకు గురయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులు, వాటి ఉప నదులు, వాటిపై నిర్మించిన ప్రాజెక్టులపై పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం రాష్ట్రంలోని సాగునీటి వనరులపై ప్రత్యేక వ్యాసం..
ఏప్రిల్ 15వ తేదీ ప్రచురణ తరువాయి.........

కృష్ణానది
పరీవాహక ప్రాంతం- 2,51,000 చ.కి.మీ.
మొత్తం పొడవు- 1440 కి.మీ.
తెలంగాణ-ఏపీలో కలిపి పొడవు- 720 కి.మీ.
ప్రవహించే రాష్ర్టాలు - మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ
అధికంగా ప్రవహించే రాష్ట్రం- కర్ణాటక- 44 శాతం. (తెలంగాణ 27.4 శాతం)
ఈ నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ (మహారాష్ట్ర) వద్ద జన్మిస్తుంది.
ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ తాలూకా తంగడి గ్రామం వద్ద ప్రవేశించి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ప్రవహిస్తూ ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రవహిస్తూ విజయవాడ (కృష్ణా) దిగువన పులిగడ్డ (సుమారు 64 కి.మీ.ల దూరంలో) వద్ద రెండు పాయలుగా చీలి ఒకటిగా కలిసి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
రెండు పాయల మధ్య ప్రాంతాన్ని దివిసీమ అంటారు.

ఉప నదులు

ఎడమవైపు నుంచి కృష్ణాలో కలిసేవి
1) భీమ, డిండి - మహబూబ్‌నగర్
2) మూసీ - రంగారెడ్డి
3) హాలియా - నల్లగొండ
4) పాలేరు, మున్నేరు - వరంగల్

కుడివైపు నుంచి కలిసేవి
1) తుంగభద్ర (కర్నూలు)
2) ఘటప్రభ 3) మలప్రభ
4) బుడమేరు 5) తమ్మిలేరు
6) రామిలేరు
తుంగభద్ర
దీని జన్మస్థానం పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలు (కర్ణాటక)
ఈ వరాహ పర్వతాల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడతాయి.
కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఏపీలోని కర్నూలు జిల్లాలోని కొసిగి అనే ప్రాంతం వద్ద ప్రవేశించి కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ సంగమేశ్వరం (కర్నూలు) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇది కృష్ణానది ఉపనదులన్నింటిలోకెల్లా పెద్దది.
ఈ నదిపై కర్ణాటకలోని హోస్పేట వద్ద నీటి పారుదలకు, జల విద్యుత్‌కు అనువుగా ఒక ఆనకట్ట నిర్మించారు.
ఈ నది ఒడ్డున మహబూబ్‌నగర్ జిల్లాలో జోగుళాంబ ఆలయం, కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఉపనదులు
కుమద్వతి (కుందానది)
వరద
హగరి - పెద్ద ఉపనది (హంద్రినీవా)
వేదవతి - పంపానదిగా వ్యవహరిస్తారు

మూసీనది
పొడవు - 250 కి.మీ.
ఈ నది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద ఉన్న శివారెడ్డిపేట వద్దగల అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది.
ఇది నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల గుండా ప్రవహిస్తూ నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
దీన్ని ముచుకుంద అని కూడా పిలుస్తారు. దీనికి ఉపనదులు ఈసీ, ఆలేరు.
ఈ నదిపై మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1920లో ఉస్మాన్‌సాగర్ డ్యాం (రిజర్వాయర్) నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని పిలుస్తారు.
ఇది హైదరాబాద్ పాతనగరానికి తాగునీటిని అందిస్తుంది.
మూసీ నదికి ఉపనది అయిన ఈసీ నదిపై మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలోనే 1927లో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నిర్మించారు.
ఇది మూసీనది వరదలను నియంత్రించడంతోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తుంది.
ఆలేరు నది హైదరాబాద్, సికింద్రాబాద్‌లను వేరుచేస్తూ ప్రవహిస్తుంది. ఈ నదిపై హుస్సేన్‌సాగర్ (1562) రిజర్వాయర్ ను నిర్మించారు.

డిండి నది
పొడవు - 152 కి.మీ.
ఈ నది మహబూబ్‌నగర్‌లోని షాబాద్ కొండల్లో పుట్టి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలగుండా ప్రవహిస్తూ ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
ఈ నదిని మీనాంబరం అని కూడా పిలుస్తారు.

పాలేరు నది
దీని పొడవు 145 కి.మీ.
ఈ నది వరంగల్ జిల్లాలోని బాణాపురంలో పుట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దుగా ప్రవహించి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
ఈ నదిపై ఖమ్మం జిల్లాలోని పాలేరు పట్టణ సమీపంలో రిజర్వాయర్‌ను నిర్మించారు.
ఈ రిజర్వాయర్ ఖమ్మం పట్టణానికి తాగునీటిని అందిస్తుంది.

మున్నేరు నది
దీని పొడవు 192 కి.మీ.
ఈ నది వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు నుంచి పుట్టి వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తుంది.
ఇది కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని ఏలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
దీనికి ఉపనదులు వైరా, కట్లేరుకృష్ణానదిపై గల ఎత్తిపోతల పథకాలు జూరాల ప్రాజెక్టు (ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు)ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని రేవులపల్లి వద్ద ఉంది.
రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు. ఇది ఒక మెషినరీ డ్యామ్.
నెట్టెంపాడు (జవహర్ ఎత్తిపోతల పథకం)
ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్ మండలం ఉప్పెరు గ్రామం వద్ద ఉంది.
MajorIrrigation

కోయిల్ సాగర్
ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని నర్వ మండలం కోయిల్‌కొండ వద్ద ఉంది.
దీన్ని పెద్దవాగు ప్రవాహంపై నిర్మించారు.

గోదావరినది ప్రాణహిత
ఇది పెన్‌గంగ, వార్ధా, వెయిన్‌గంగ అనే మూడు నదుల కలయికతో ఏర్పడుతుంది.
ఈ మూడు నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాగుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి (చెన్నూరు) వద్ద కలిసి ప్రాణహితగా ఏర్పడింది.
ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల గుండా 113 కి.మీ.ల దూరం ప్రయాణించి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
ఈ నదికి కుడివైపు నుంచి పెన్‌గంగ, మధ్య నుంచి వార్ధా, ఎడమవైపు నుంచి వెయిన్‌గంగ కలుస్తుంది.
ప్రాణహితగా ఏర్పడే ఈ మూడు నదులు సాత్పూరా (మధ్యప్రదేశ్) పర్వతాల్లో జన్మించాయి.
వార్ధా: మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లోని బేతుల్ జిల్లా ముల్తాయ్ వద్ద (528 కి.మీ. పొడవు) జన్మించి పెన్‌గంగ నదితో జుగాడ్ వద్ద కలుస్తుంది. ఇది విదర్భ ప్రాంతం అతిపెద్ద నది.
పెన్‌గంగ: విదర్భలోని రేవుల్‌ఘాట్ పర్వతాల వద్ద పుట్టి మహారాష్ట్రలోని యావత్ మల్ జిల్లాలోని జుగాడ్ వద్ద వార్ధా నదిలో కలుస్తుంది.
ప్రాణహిత నదిపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకం ఉంది. దీన్నే డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల పథకం అంటారు.
ప్రాణహిత నది ఎడమవైపు నుంచి కలుస్తుంది. ఇది గోదావరి నదికి 40 శాతం నీటి లభ్యతను అందిస్తుంది.

కడెం
ఆదిలాబాద్ జిల్లా బోధ్ తాలూకాలోని బోతాయి గ్రామం దీని జన్మస్థలం. జిల్లాలోని ఖానాపూర్ మండలం పసుపుల గ్రామం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
ఈ నది ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది.
ఇది గోదావరికి ఎడమవైపు నుంచి కలుస్తుంది.

కడెంపై ఉన్న జలపాతాలు

కుంటాల
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది.
ఇది రాష్ట్రంలోనే ఎత్తయిన (147 అడుగులు/45మీ.) జలపాతం.

పొచ్చెర
ఇది ఆదిలాబాద్ జిల్లా బోధ్ వద్ద ఉంది. దీని ఎత్తు 20 మీ.

గాయత్రి
ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుర్దు గ్రామం వద్ద ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర జలపాతాలు
సప్త గుండాల (మిట్టి జలపాతం) - సిర్పూరు
బోదర - కెరమెరి మండలం
కుండాయి - నార్నూర్
kuntala

మానేరు
ఈ నది జన్మస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కొండలు.
మొత్తం పొడవు 126 కి.మీ.
ఇది కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కుడివైపు నుంచి కలుస్తుంది.
ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం - కరీంనగర్
దీనిపై నర్మాల గ్రామం వద్ద ఎగువ మానేరు డ్యాం (నిజాం కాలంలో), మానువాడ వద్ద మిడ్ మానేరు డ్యామ్ (నిర్మాణ దశ), కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యామ్ ఉన్నాయి.

ఇంద్రావతి
ఈ నది జన్మస్థలం ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌లో తూర్పు కనుమల్లోని దండకారణ్య ప్రాంతంలోగల కలహండి జిల్లా.
ఇది గోదావరి ఎడమవైపు నుంచి కరీంనగర్ జిల్లాలో కలుస్తుంది.
దీనికి అత్యంత వేగంగా కలిసే నది అని పేరుంది.
దీనిపై ఏర్పడిన జలపాతం చిత్రకూట్ (ఛత్తీస్‌గఢ్)

కిన్నెరసాని
లక్నవరం చెరువు సమీపంలో ఈ నది జన్మిస్తుంది.
ఈ నది వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలానికి దిగువన కుడివైపు నుంచి గోదావరిలో కలుస్తుంది.

శబరి
ఈ నది జన్మస్థలం తూర్పు కనుమల్లోని సింకారం కొండలు
ఇది గోదావరి నదికి ఎడమవైపు నుంచి ఖమ్మం జిల్లా కూనవరం వద్ద కలుస్తుంది.
దీని పరీవాహక ప్రాంతంలో అత్యధిక వార్షిక వర్షపాతం (1250 మి.మీ., తెలంగాణలో) నమోదవుతుంది.
ఈ నది తీరాన పర్ణశాల ఉంది.

సీలేరు
ఈ నది ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరిలో కలుస్తుంది.
పోలవరం ప్రాజెక్టు - విశాల మైదానం గల ప్రాంతం, తెలంగాణ-ఏపీ మధ్య నిర్మాణ (డిజైనింగ్) దశలో ఉంది.

లెండి అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టు
లెండి నదిపై తెలంగాణ-మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గోనెగావ్ గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు ఉంది.
రాష్ట్రంలో ప్రవేశించే ప్రదేశం - శేఖర్‌గావ్ (నిజామాబాద్)
రాష్ట్రంలో లబ్ధి పొందే మండలాలు - మద్నూర్, బిచ్కుంద (నిజామాబాద్)

కల్వకుర్తి ఎత్తిపోతల: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి వద్ద ఉంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ: మహబూబ్‌నగర్ వద్ద ఉంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెల వద్ద ఉంది. దీన్ని కురుమూర్తి ఎత్తిపోతల అంటారు.
నక్కలగండి ఎత్తిపోతల (డిండి ఎత్తిపోతల): నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం వద్ద ఉంది.
రాజీవ్ భీమా ఎత్తిపోతల: మహబూబ్‌నగర్ జిల్లా పంచదేవ్‌పాడు వద్ద ఉంది.


నాగార్జున సాగర్ ఆనకట్ట
ఈ నదిపై నల్లగొండ జిల్లా నందికొండ వద్ద నాగార్జున సాగర్ ఆనకట్టను నిర్మించారు. దీని ఎత్తు 124.7 మీ.
ఈ ఆనకట్టకు 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
1967 ఆగస్టు 4న ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు.
1969లో ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి.
ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజినీర్- మీర్ జాఫర్ అలీ
ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ నిధులతో నిర్మించిన ప్రపంచంలోని రాతికట్టల్లో కెల్లా ఎత్తయినది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి.
1) లాల్‌బహదూర్ కాలువ (ఎడమ కాలువ): ఇది నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది.
జవహర్ కాలువ (కుడి కాలువ): ఇది గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది. ఇది ప్రపంచంలోని సేద్యపునీటి కాలువల్లో కెల్లా పొడవైనది (203 కి.మీ.).
ఇది మొదటిసారిగా రివర్సబుల్ టర్బైన్లను ఉపయోగించిన జల విద్యుత్ కేంద్రం.


గోదావరి తీరాన గల పట్టణాలు


1) నాసిక్, నాందేడ్ (మహారాష్ట్ర)
2) బాసర (ఆదిలాబాద్)
3) ధర్మపురి (కరీంనగర్)
4) భద్రాచలం (ఖమ్మం)

గోదావరి తీరాన గల పుణ్యక్షేత్రాలు


1) బాసర (ఆదిలాబాద్)- జ్ఞాన సరస్వతి దేవాలయం
2) ధర్మపురి (కరీంనగర్)- లక్ష్మీనర్సింహ స్వామి,
యమధర్మరాజు ఆలయాలు
3) గూడెం (ఆదిలాబాద్)- సత్యనారాయణ స్వామి ఆలయం
4) కాళేశ్వరం (కరీంనగర్)- కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు
5) భద్రాచలం (ఖమ్మం)- సీతారామచంద్రస్వామి ఆలయం

గోదావరిపై గల ఎత్తిపోతల పథకాలు


1) అలీసాగర్ - కోసీ (నవీపేట, నిజామాబాద్)
2) యంచ - యంచ (నిజామాబాద్)
3) అర్గుల్ రాజారాం - ఉమ్మెడ (నవీపేట, నిజామాబాద్)
4) చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి - సేట్‌పల్లి (నిజామాబాద్)
5) కడెం (కడెం నారాయణరెడ్డి)- పెద్దూరు (ఆదిలాబాద్)
6) ప్రాణహిత-చేవెళ్ల - తుమ్మిడిహట్టి (ఆదిలాబాద్)
7) ఎల్లంపలి (శ్రీపాదసాగర్)- ఎల్లంపల్లి
(రామగుండం, కరీంనగర్)
8) కాళేశ్వరం - కన్నెపల్లి (కరీంనగర్)
9) దేవాదుల (జే చొక్కరావు ఎత్తిపోతల)- గంగాపురం
(వరంగల్)
10) కంతనపల్లి - కంతనపల్లి (వరంగల్)
11) దుమ్ముగూడెం (జ్యోతిరావు ఫూలే ఎత్తిపోతల)
- అనంతారం (ఖమ్మం)
kasamramesh

3751
Tags

More News

VIRAL NEWS