తెలంగాణ జాగ్రఫీ- గ్రూప్స్ ప్రత్యేకం


Wed,June 15, 2016 02:33 AM

దేశంలో నదీవ్యవస్థ 3 రకాలు
జీవనదీ వ్యవస్థ


-నిరంతరం నీరు ప్రవహించే నదులను జీవనదులు అంటారు. ఇవి నౌకాయానానికి అనుకూలమైనవి కావు.
-జీవనదుల్లో పురాతన నది - బ్రహ్మపుత్ర

Godavariwater

వర్షాధార నదీవ్యవస్థ


-వీటిని ద్వీపకల్ప నదులని కూడా అంటారు.
-వర్షాలు వచ్చినపుడు ప్రవహించే నదులే ఇవి.
-ఇవి ఇండియాలో పురాతన నదులు.

అంతర్ భూభాగ నదీ వ్యవస్థ


-భూమి అంతర్భాగంలో జన్మించి, ఇసుక, ఎడారి ప్రాంతాల్లో అంతమయ్యే నదులను అంతర్‌భూభాగ నదీవ్యవస్థ అంటారు.


తెలంగాణలో ప్రవహించే నదులు

గోదావరి


-ద్వీపకల్ప నదుల్లో ఇది అతిపెద్ద నది.
-గోదావరి నదిని దక్షిణగంగ, వృద్ధగంగ, భారతదేశపు రైన్ నది అని కూడా పిలుస్తారు.
-ఈ నది జన్మస్థలం - మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకం అనే ప్రాంతం. దీని పొడవు - 1465 కి.మీ.
-ఈ నది తెలంగాణలోకి ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద ప్రవేశించి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మీదుగా ఆంధ్రవూపదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
-ఈ నది ఉపనదులు - ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్థా, పెన్‌గంగ, వెయిన్‌గంగ.
-ఈ నది ముఖ్యపట్టణం తెలంగాణలోని భద్రాచలం.
-గోదావరి నది ఒడ్డునగల నగరం - బాసర.
-గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు - కరీంనగర్‌లో ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, వరంగల్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకం, పీవీ నర్సింహారావు పథకం, ఖమ్మంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు.

కృష్ణానది


-తెలంగాణలో రెండో అతిపొడవైన నది.
-అత్యధిక నీటి ప్రవాహం గల నది.
-ఇది పశ్చిమ కనుమల్లోని మహాబళేశ్వర్ వద్ద జన్మించింది.
-ఈ నది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌ల్లో ప్రవహిస్తుంది.
-కృష్ణా నది రాష్ట్రంలోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది.
-ఈ నది మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల గుండా ప్రయాణించి ఆంధ్రవూపదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-ఉపనదులు : డిండి, కొయినా, ఘటవూపభ, మలవూపభ, దూద్‌గంగ, భీమ, తుంగభద్ర, మున్నేరు, మూసీ.
-కృష్ణానది ఉపనదుల్లో తుంగభద్ర పెద్దది.
-కృష్ణానదిపై తెలంగాణలోగల ప్రాజెక్టులు - మహబూబ్‌నగర్‌లో జూరాల/వూపియదర్శిని ప్రాజెక్టు, నల్లగొండలో - నాగార్జునసాగర్ ప్రాజెక్టు.

తుంగభద్ర నది


-తుంగభద్ర నది కృష్ణా ఉపనదుల్లో ఒకటి.
-ఈ నది కర్ణాటకలోని వరాహ కొండల్లో జన్మిస్తుంది.
-ఈ నది తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక.
-ఈ నదిపై తెలంగాణలో ఆలంపూర్ పుణ్యక్షేత్రం ఉంది.
-తెలంగాణ-కర్ణాటకల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ తుంగభవూద.
-తుంగభద్ర నది ఉపనదులు - డిండి, మూసీ, భీమ, కొయినా, మున్నేరు.

డిండి నది


-ఈ నదిని మీనాంబరం అని కూడా పిలుస్తారు. ఇది మహబూబ్‌నగర్‌లోని షాబాద్ గుట్టల్లో జన్మించి దేవరకొండ (నల్లగొండ జిల్లా) ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 153 కి.మీ.

మూసీ నది


-ఇది రంగాడ్డి జిల్లా శివాడ్డిపేట వద్ద అనంతగిరి కొండల్లో జన్మించి, హైదరాబాద్ గుండా ప్రవహించి నల్లగొండ జిల్లాలో వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి మరోపేరు ముచుకుంద.
-ఈ నదిపై హైదరాబాద్‌కు పశ్చిమాన ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ ఉంది.

ప్రాణహిత నది


-ఇది మధ్యవూపదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లో పుట్టి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల గుండా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు వద్ద గోదావరిలో కలుస్తుంది.
-ఈ నది పెన్‌గంగా, వెయిన్‌గంగా, వార్ధా నదుల కలయికవల్ల ఏర్పడుతుంది.
-దీనిపై ప్రాణహిత-చే ఎత్తిపోతల పథకం ఉంది.

మంజీరా నది


-ఇది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి మెదక్ జిల్లాలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరిలో కలుస్తుంది. దీని పొడవు 644 కి.మీ.
-ఈ నదిపై సింగూరు (మెదక్), నిజాంసాగర్ (నిజామాబాద్) ప్రాజెక్టులు ఉన్నాయి.

పాలేరు నది


-ఇది వరంగల్ జిల్లా దక్షిణ భాగంలో పుట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రయాణించి ఆంధ్రవూపదేశ్‌లో ప్రవేశించి కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపొడవు 145 కి.మీ.

మున్నేరు నది


-ఇది కృష్ణానది ఉపనది.
-వరంగల్ జిల్లా పాకాల చెరువు నుంచి బయల్దేరి కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 198 కి.మీ.

నీటిపారుదల సౌకర్యాలు


-వర్షపాతం ద్వారా కాకుండా ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా పంటలకు నీటి సరఫరా చేయడాన్ని ‘నీటిపారుదల’ అంటారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల కింద ఎక్కువ భూమి సాగవుతుంది. నీటిపారుదల సౌకర్యాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి..

బావులు


-బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్తరవూపదేశ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్.
-రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది.

కాలువలు


-కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదలగల రాష్ట్రాలు- తెలంగాణ, ఉత్తరవూపదేశ్, రాజస్థాన్, హర్యానా.
-రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లాలు- కరీంనగర్, వరంగల్, ఖమ్మం
-రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టార్లు కాలువల ద్వారా సాగవుతున్నది.

చెరువులు


-రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 2.83 లక్షల హెక్టార్లు. అత్యధికంగా సాగవుతున్న జిల్లా వరంగల్.
-అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు- ఆంధ్రవూపదేశ్, తమిళనాడు, కర్ణాటక, యూపీ.



నాగార్జునసాగర్


-ఇది రాష్ట్రంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు. అత్యంత ఎత్తయిన రాతికట్ట, తాపి ఆనకట్ట.
-ఈ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1963లో పూర్తయ్యింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ‘మ్యాన్‌మేడ్’ రిజర్వాయర్.
-ఇది నల్లగొండ జిల్లాలోని నందికొండ వద్ద కృష్ణా నదిపై ఉంది.
-దీని ఎడమ కాలువ పేరు లాల్‌బహదూర్ శాస్త్రి కాలువ, దీనిపొడవు 210 కి.మీ. కుడి కాలువ జవహర్‌లాల్ నెహ్రూ కాలువ. దీని పొడవు 310 కి.మీ.
-ఈ ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజినీర్ మీర్ జాఫర్ అలీ.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు


-ఈ ప్రాజెక్టు 1963, జూలై 26న ప్రారంభమైంది. దీనిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు.
-దీని వల్ల నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయి. దాదాపు 3.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుంది.
-ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ అని మూడు కాలువలు ఉన్నాయి. అయితే ప్రధానమైనది మాత్రం కాకతీయ కాలువ.
-ఇది కొన్ని జాతీయ ప్రాజెక్టులకు నీరందిస్తున్నది. దీని పూర్వనామం పోచంపాడు ప్రాజెక్టు.
-గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ అయిన దీన్ని మాజీ ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. దీని గరిష్ట ఎత్తు 1,091 అడుగులు.


ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు


-ఇది మహబూబ్‌నగర్‌లో ప్రముఖమైనది. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు.
-ఈ ప్రాజెక్టును గద్వాలకు 16 కి.మీ. దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి దగ్గర నిర్మించారు.
-ఇది సుమారు 20 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందిస్తుంది. రెండు ప్రధాన కాలువులు ఉన్నాయి. అవి సోమనాద్రి కాలువ (కుడి), ఎన్టీఆర్ కాలువ (ఎడమ).

నెట్టెంపాడు


-ఇది మహబూబ్‌నగర్‌లో కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం.
-ఈ ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ మీద ఆధారపడి ఉంటుంది.

కోయిల్‌సాగర్


-ఈ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లార గ్రామం వద్ద 1945లో నిర్మించారు.
-దీనివల్ల 12 వేల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుంది. దీని నీటి సామర్ధం 2,276 టీఎంసీలు.

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)


-మహబూనగర్ జిల్లాలో ఉంది.
-ఈ ప్రాజెక్టును తుంగభద్ర నదిపై కర్ణాకటలోని రాయచూర్ జిల్లాలో నిర్మించారు. దీని ద్వారా రాష్ట్రంలోని గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

సరళాసాగర్ ప్రాజెక్టు


-మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉంది.
-దీన్ని సైఫోన్స్ (Siphons) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన పెద్ద ప్రాజెక్టుల్లో ఆసియాలోనే ఈ ప్రాజెక్టు మొదటిది, ప్రపంచంలో రెండోది.
-ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు సాగు నీటినే కాకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

నిజాంసాగర్ ప్రాజెక్ట్


-గోదావరి ఉపనది అయిన మంజీరా నదిపై నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ మండలం అచ్చంపేట వద్ద నిర్మించారు.
-ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆయకట్టు 2,31,339 ఎకరాలు. దీన్ని 1923లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.

మాధవడ్డి ప్రాజెక్టు


-ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న నల్లగొండ జిల్లా కోసం ఈ ప్రాజెక్టును 1983లో ప్రారంభించారు.
-దీన్ని ఎస్‌ఎల్‌బీసీ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు లక్షం 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించడం.

దేవాదుల ప్రాజెక్టు


-ఈ ప్రాజెక్టును వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో సాగునీరందించేందుకు గోదావరి నదిపై రూపొందించారు.
-దీన్ని వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం దేవాదుల, గంగారం గ్రామాల వద్ద నిర్మిస్తున్నారు.
-238 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లనున్న ఈ ప్రాజెక్టు దేశంలో మొదటిది.

srinivas

ప్రాజెక్టులు పాత, కొత్త పేర్లు


పాత పేరు - కొత్త పేరు
-దుమ్ముగూడెం ప్రాజెక్టు - మహాత్మా జ్యోతిరావ్‌ఫూలే
-ప్రాణహిత-చే - బీఆర్ అంబేద్కర్ చేవెళ్ల సుజల స్రవంతి
-హైదరాబాద్-గోదావరి - మౌలానా అబుల్‌కలాం సుజల మంచినీటి సరఫరా పథకం
-కంతానపల్లి ఎత్తిపోతల పథకం - పీవీ నరసింహారావు ప్రాజెక్టు

రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు


-స్వర్ణ ప్రాజెక్టు - ఆదిలాబాద్‌లోని జౌలి వద్ద నిర్మిస్తున్నారు
-ఊచికట్ట వాగు పథకం - మహబూబ్‌నగర్ జిల్లా
-వెంగళరావు లిఫ్ట్ ఇరిగేషన్ - మహబూబ్‌నగర్ జిల్లా
-మల్లూరువాగు ప్రాజెక్టు - వరంగల్ జిల్లా
-ఎగువ కౌలాసనాలా ప్రాజెక్టు - నిజామాబాద్ జిల్లా
-వట్టివాగు ప్రాజెక్టు - ఆదిలాబాద్ జిల్లా

3602
Tags

More News

VIRAL NEWS