టీఎస్ టెట్-2017


Wed,June 14, 2017 01:42 AM

ఏడాది ఎదురుచూపు తర్వాత టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఈ నిబంధనతో గత ఏడేండ్లుగా టెట్‌కు పోటీ పెరుగుతున్నది. అంతేకాకుండా టెట్ మార్కులకు డీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో వెయిటేజీ ఇస్తుండటంతో ఎక్కువ మార్కులు సాధించడానికి అభ్యర్థులు మళ్లీమళ్లీ టెట్ రాస్తున్నారు. గత టెట్ ఫలితాలను విశ్లేషిస్తే అర్హత సాధించినవారి శాతం చాలా తక్కువగా ఉంది. కానీ బీఈడీ, డీఈడీ చేసిన వారు ఎక్కువగా ఉండటంతో వారంతా టెట్‌లో అర్హత కోసం శ్రమిస్తున్నారు. టెట్ పరీక్షకు నేటికి సరిగ్గా 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా టెట్ వివరాలు...

ఉపాధ్యాయ ఉద్యోగానికి టెట్ తప్పనిసరి


-నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) 2010, ఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్‌టీఈ) 2009 సెక్షన్ (1) ఆఫ్ సెక్షన్ 23 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించినవారు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమితులు కావడానికి అర్హులు. దీంతో బీఈడీ/డీఈడీ చేసినా స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో చేరాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.

టీఎస్ టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి.


-పేపర్ - 1: ఒకటి- ఐదో తరగతి వరకు బోధించే వారు రాయాలి.
-పేపర్ - 2: 6-8 తరగతులు బోధించే వారు రాయాలి.

పేపర్ - 1 రాయడానికి అర్హతలు:


-ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులయితే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. దీంతోపాటు రెండేండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేండ్ల బీఈఎల్ ఎడ్యుకేషన్ లేదా రెండేండ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. లేదా ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులు), డీఈడీ/బీఈఎల్‌ఈడీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత (2015 గైడ్‌లైన్స్ ప్రకారం).

టీఎస్ టెట్ పేపర్ - 2 అర్హత:


-బీఏ/బీఎస్సీ, బీకాంలో కనీసం 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు 45 శాతం) ఉత్తీర్ణత. బీఈడీ/బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత లేదా నాలుగేండ్ల బీఏఈడీ/బీఎస్సీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా తత్సమన కోర్సులో ఉత్తీర్ణత.
TSTET

పేపర్ - 1 పరీక్ష విధానం:


-150 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 2 గంటల 30 నిమిషాలు
-చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ- 30 ప్రశ్నలు, లాంగ్వేజ్- I 30, లాంగ్వేజ్- II 30, మ్యాథ్స్- 30, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు, 150 మార్కులు.
-లాంగ్వేజ్- II ఇంగ్లిష్ అందరికీ తప్పనిసరి.

పేపర్ - 2 పరీక్ష విధానం:


-150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 2 గంటల 30 నిమిషాలు.
-చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగాగీ- 30, లాంగ్వేజ్- I 30, లాంగ్వేజ్- II 30, మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు మ్యాథ్స్, సైన్స్ నుంచి 60 ప్రశ్నలు. సోషల్ టీచర్లకు సోషల్ స్టడీస్ నుంచి 60 మార్కులు. ఇతర సబ్జెక్టుల వారికి సోషల్/మ్యాథ్స్, సైన్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-మ్యాథ్స్‌లో 30 ప్రశ్నలకుగాను 24 కంటెంట్, 6 పెడగాగీ నుంచి ఇస్తారు.
-సైన్స్‌లో ఫిజికల్ సైన్స్- 12, బయాలజీ- 12, సైన్స్ పెడగాగీ నుంచి 6 ప్రశ్నలు ఇస్తారు.
-సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 60 ప్రశ్నలు, పెడగాగీ నుంచి 12 ప్రశ్నలు ఇస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.

టెట్‌లో అర్హత మార్కులు


-జనరల్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు
-బీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు
-నోట్: పీహెచ్‌సీలో విజువల్లీ, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 40 శాతం, వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు 75 శాతం వైకల్యం ఉంటేనే వారిని పీహెచ్‌సీ అభ్యర్థులుగా పరిగణిస్తారు.
-టీఎస్ టెట్ సర్టిఫికెట్/మార్కుల మెమో పరీక్ష జరిగిన నాటి నుంచి 7 ఏండ్లు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు చెల్లింపు: టీఎస్ ఆన్‌లైన్‌లో
-ఫీజు చెల్లింపునకు చివరితేదీ: జూన్ 22
-దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: జూన్ 23
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: జూలై 17 నుంచి
-పరీక్ష తేదీ: జూలై 23
-పేపర్-1: ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు
-పేపర్ - 2: మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు
-ఫలితాల వెల్లడి: ఆగస్టు 5
-వెబ్‌సైట్: http://tstet.cgg.gov.in

1968
Tags

More News

VIRAL NEWS