జిప్‌మర్‌లో 70 ఖాళీలు


Wed,January 16, 2019 11:15 PM

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్&రిసెర్చ్ (జిప్‌మర్)లో గ్రూప్ బీ,సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
jipmer-results
-మొత్తం ఖాళీలు-70.
-గ్రూప్ బీ పోస్టులు:
-జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-3, టెక్నికల్ అసిస్టెంట్ (న్యూక్లియర్ మెడిసిన్)-2, టెక్నికల్ అసిస్టెంట్-1, నర్సింగ్ ఆఫీసర్-60 ఖాళీలు.
-గ్రూప్ సీ పోస్టులు:
-గ్రేడ్-2 స్టెనోగ్రాఫర్-3, ఎంటీఎస్ (కాబ్లర్)-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు- పీజీలో హిందీ/ఇంగ్లిష్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. హిందీ నుంచి ఇంగ్లిష్ లేదా ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించగల సామర్థ్యం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ పోస్టుకు డిగ్రీలో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ చదివి ఉండాలి. లేదా డిగ్రీస్థాయిలో ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. వయస్సు 35 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 13
-వెబ్‌సైట్: www.jipmer.puducherry.gov.in

540
Tags

More News

VIRAL NEWS