ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు
నవరత్న హోదాకలిగిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ దేశంలో ఆయిల్, గ్యాస్‌ను వెలికితీస్తున్న ప్రముఖ సంస్థ.
మొత్తం పోస్టులు: 47
విభాగాల వారీగా..
డ్రిల్లింగ్: 7 (జనరల్-4, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1)
అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేయాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్ అభ్యర్థులకు 32 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 37 ఏండ్లు, ఓబీసీలకు 35 ఏండ్లు నిండి ఉండాలి.
ఫీల్డ్ ఇంజినీరింగ్: 2 (జనరల్-1, ఓబీసీ-1)
పైప్‌లైన్: 4 (జనరల్-2, ఎస్సీ-1, ఓబీసీ-1)
అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-32, ఓబీసీ- 35, ఎస్సీ-37 ఏండ్లు నిండాలి.
ప్రొడక్షన్: 3 (జనరల్-2, ఓబీసీ-1)
అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్ ఉండాలి. పెట్రోలియం లేదా పెట్రోలియం టెక్నాలజీలో పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-32 ఏండ్లు, ఓబీసీ-35 ఏండ్లు నిండినవారై ఉండాలి.
సివిల్- 2
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి 32 ఏండ్లుండాలి.
సీనియర్ కెమిస్ట్/సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్: 5 (జనరల్-3, ఎస్సీ-1, ఓబీసీ-1)
అర్హతలు: కెమిస్ట్రీలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు డిగ్రీ స్థాయిలో పీసీఎం చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్ 34, ఎస్సీ-39, ఓబీసీ-37 ఏండ్లు ఉండాలి.
సీనియర్ బయోటెక్నాలజిస్ట్: 1
అర్హతలు: బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ లేదా బయోటెక్నాలజీలో పీజీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి 34 ఏండ్లు నిండినవారై ఉండాలి.
సీనియర్ ఆఫీసర్ (హెచ్ఆర్): 3 (జనరల్-2, ఓబీసీ-1)
అర్హతలు: మేనేజ్మెంట్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా సోషల్ వెల్ఫేర్ లేదా సోషల్ వర్క్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో పీజీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-34, ఓబీసీ-37 ఏండ్లు నిండినవారై ఉండాలి.
ఐటీ/ఈఆర్పీ: 5 (జనరల్ 4, ఓబీసీ 1)
అర్హతలు: కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-32, ఓబీసీ-35 ఏండ్లు నిండినవారై ఉండాలి.
టెలికం/ఇన్స్ట్రుమెంటేషన్- 6(జనరల్ 4, ఓబీసీ-2)
అర్హతలు: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-32, ఓబీసీ-35 ఏండ్లు నిండినవారై ఉండాలి.
సీనియర్ ఆఫీసర్ (హెచ్ఎస్ఈ) లేదా సీనియర్ ఇంజినీర్ (ఫైర్ సర్వీస్): 7
(జనరల్-5, ఓబీసీ-2)
అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంట్ లేదా ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ లేదా హెచ్ఎస్ఈలో పీజీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-34, ఓబీసీ-37 ఏండ్లు నిండినవారై ఉండాలి.
సీనియర్ ఆఫీసర్ (పీఏ): 2
అర్హతలు: మాస్‌కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్స్ లేదా సోషల్ వర్క్ లేదా రూరల్ మేనేజ్మెంట్లో పీజీ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 12 నాటికి జనరల్-34 ఏండ్లు నిండినవారై ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ డీలకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 12
వెబ్సైట్: www.oil-india.com