ఐసీటీ ఇన్నోవేటర్ అవార్డు -2017


Sun,July 16, 2017 01:19 AM

ఐసీటీ అకాడమీ ఇన్నోవేటర్ అవార్డు 2017 కోసం ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను తయారుచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
COMPUTERS
వివరాలు:
భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐసీటీ అకాడమీ, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలను ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో పరిశోధన, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ప్రోత్సహించడానికి 2012 నుంచి ఐసీటీ నిర్వహిస్తుంది.
-సీఎస్‌ఈ, సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచీల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
-ఈ పోటీలో పాల్గొనడానికి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఫుల్‌టైం యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులు.
-ఈ పోటీలకు షార్ట్‌లిస్ట్ అయిన ప్రాజెక్టుల డెమోను ఇండస్ట్రీ నిపుణుల ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. వీటిలో ఎంపికైన వాటికి క్యాష్‌ప్రైజ్, ట్రోఫీలను అందిస్తారు.
-రిజిస్ట్రేషన్స్‌కు చివరితేదీ: జూలై 31
-ఇతర వివరాలకు youth.ictacademy. in.Registrations

-టాక్‌థాన్: విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పోటీలో పాల్గొనడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఐసీటీ అకాడమీ యూత్ టాక్ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం. కమ్యూనికేషన్ స్కిల్స్ పోటీలను నిర్వహించి యువతను ప్రోత్సహించడమే కాకుండా తోటి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి టాక్‌థాన్‌ను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌తో కలిసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
-టెక్నాలజీ, ఇంజినీరింగ్, సైన్స్, ఫ్యూచర్ వరల్డ్, జాతీయ, అంతర్జాతీయ (నాన్ పొలిటికల్) ఇష్యూస్, ఇన్నోవేషన్, బిజినెస్, మేనేజ్‌మెంట్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర అంశాలపై ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలో గెలిచినవారిని ఐసీటీ అకాడమీ సింగపూర్ ఎడ్యుకేషనల్ ట్రిప్‌నకు అనుమతిస్తారు.
-పూర్తి వివరాల కోసం youth.ictacademy.in చూడవచ్చు.

284
Tags

More News

VIRAL NEWS