ఐఐహెచ్‌ఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు


Sat,August 12, 2017 11:31 PM

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ (ఐఐహెచ్‌ఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్, జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ, తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIHR
వివరాలు: ఐఐహెచ్‌ఆర్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇది పండ్లు, కూరగాయలు, ఔషధాలు, సుగంధ మొక్కలపై పరిశోధన చేసే నోడల్ ఏజెన్సీ.
-మొత్తం ఖాళీలు: 32
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-22 పోస్టులు, రిసెర్చ్ అసోసియేట్-3 పోస్టులు
-యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టులు, ఫీల్డ్ హెల్పర్-1, ఆఫీస్ అసిస్టెంట్-1, స్కిల్ అసిస్టెంట్-1, జూనియర్ రిసెర్చ్ ఫెలో-2 పోస్టులు
-వయస్సు: సీనియర్ రిసెర్చ్ ఫెలో: పురుషులు 35 ఏండ్లు, మహిళలు 40 ఏండ్లు మించరాదు.
జూనియర్ రిసెర్చ్‌ఫెలో: పురుషులు 30 ఏండ్లు, మహిళలు 35 ఏండ్లు మించరాదు.
-ఇతర పోస్టులు: 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హత: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (బయోటెక్నాలజీ), ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ (ప్లాంట్ ఫిజియాలజీ), ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ హార్టికల్చర్, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ప్లాంట్ మైక్రోబయాలజీ) లేదా బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ, బీఎస్సీ, పీజీ, మాస్టర్ డిగ్రీ (బాటనీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్, వెజిటుబుల్ బ్రీడింగ్)తోపాటు నెట్ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: IIHR, Hesaraghatta Lake Post, Bangalore- 560089
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 12,13
-వెబ్‌సైట్: www.iihr.ernet.in

263
Tags

More News

VIRAL NEWS