ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ -సీ పోస్టులు


Thu,May 18, 2017 12:12 AM

-పదోతరగతి, ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు అవకాశం
- కేంద్రకొలువులు, భరోసా జీవితం
-ప్రత్యేక అలవెన్స్‌లు, రాతపరీక్ష ద్వారా ఎంపిక
-దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు


INDIAN-AIRFORCE
భారత వాయుసేనలో గ్రూప్ సీ సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
త్రివిధ దళాలలో వాయుసేన కీలకమైంది. దీనిలో సివిలియన్ కోటాలోని ఖాళీల భర్తీకి ప్రస్తుత నోటిఫికేషన్ విడుదల చేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 174 విభాగాల వారీగా ఖాళీలు..
-సూపరింటెండెంట్ (స్టోర్) - 44, స్టోర్ కీపర్ - 28, ఫైర్‌మ్యాన్ - 10, టైలర్ - 1, కుక్ - 4, వాల్కనైజర్ - 1, దోబి - 1, మెస్‌స్టాఫ్ - 2, ఎంటీఎస్ - 71, సఫాయివాలా - 11, స్టెనో - 1 ఖాళీ ఉన్నాయి.
విద్యార్హతలు, పేస్కేల్:
సూపరింటెండెంట్ (స్టోర్) - డిగ్రీ ఉత్తీర్ణత. స్టోర్స్ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
స్టోర్ కీపర్ - ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. స్టోర్స్ నిర్వహణ, స్టోర్ అకౌంట్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
గ్రేడ్ - 2 స్టెనో -ఇంటర్, స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు డిక్టేషన్, నిమిషానికి 65 పదాలు టైప్‌రైటర్‌పై, 50 పదాలు కంప్యూటర్‌పై ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
టైలర్ - టైలరింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్. ఎక్స్‌సర్వీస్‌మెన్ అయితే సంబంధిత ట్రేడ్‌లో పనిచేసిన వారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
కుక్ - పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో కనీసం ఆరునెలల అనుభవం ఉండాలి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
దోబి - పదోతరగతితోపాటు గుర్తింపు పొందిన సంస్థ లేదా ఆర్గనైజేషన్‌లో కనీసం ఏడాదిపాటు దోబిగా పనిచేసిన అనుభవం ఉండాలి.

పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
వాల్కనైజర్ - పదోతరగతి ఉత్తీర్ణత.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
మెస్‌స్టాఫ్ - పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
మల్టీటాస్కింగ్ స్టాఫ్ - పదోతరగతి ఉత్తీర్ణత. వాచ్‌మెన్ లేదా లస్కర్/మాలిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
వయస్సు: గ్రేడ్ - 2 స్టెనో, ఫైర్‌మెన్ పోస్టులకు 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
రాతపరీక్ష: దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్/ ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
నోట్: పై పోస్టులకు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు)
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన మే 13 -19 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైంది.
రాష్ట్ర అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి.
CO, Equipment Depot C/O 408, Air Force Station,Hakimpet, Secunderabad TS -500014
వెబ్‌సైట్: http://indianairforce.nic.in

1226
Tags

More News

VIRAL NEWS