ఎయిమ్స్‌లో 178 ప్రొఫెసర్ పోస్టులు

Mon,March 20, 2017 01:24 AM

PROFESSER
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్-భువనేశ్వర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఎయిమ్స్ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో వైద్య కళాశాల, వైద్య పరిశోధన చేయడానికి 1956లో స్థాపించారు. ఎయిమ్స్ భువనేశ్వర్ ను ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే లక్ష్యంతో ప్రధాన్‌మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకంలో భాగంగా దీన్ని స్థాపించారు.

మొత్తం ఖాళీల సంఖ్య -178


-ప్రొఫెసర్స్-41 పోస్టులు
-అడిషనల్ ప్రొఫెసర్స్-33 పోస్టులు
-అసోసియేట్ ప్రొఫెసర్స్-46 పోస్టులు
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్-58 పోస్టులు
-విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ/ల్యాబ్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఈఎన్‌టీ, రేడియోగ్నాసిస్, ఆనస్థీషియాలజీ, డెంటిస్ట్రీ, ట్రాన్స్‌ప్యూజన్ మేడ్ అండ్ బ్లడ్ బ్యాంక్, రేడియోథెరపీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ/ హెమాటాలజీ, పల్మనరీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్స్ సర్జరీ, నియోనటాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్

అర్హతలు:


-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ తోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/ రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు

పే అండ్ అలవెన్స్‌లు:


-ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,500/-
-అడిషనల్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) :రూ.37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,500/-
-అసోసియేట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) :రూ.37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 3) :రూ.15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 8,000/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజులేదు)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: All India Institute of Medical Sciences, Bhubaneswar
-దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 5
-వెబ్‌సైట్: www.aiimsbhubaneswar.edu.in.

565
Tags

More News

మరిన్ని వార్తలు...