ఎన్‌ఐఎన్‌లో ఇంటర్వ్యూలు


Mon,July 17, 2017 12:46 AM

హైదరాబాద్ తార్నాకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో కింది పోస్టుల కోసం నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు నోటిఫికేషన్ విడుదలైంది.
NIN

వివరాలు: ఎన్‌ఐఎన్ సంస్థ ఐసీఎంఆర్ పరిధిలో పనిచేస్తుంది.
టెక్నికల్ అసిస్టెంట్ - 1 ఖాళీ
అర్హతలు: బీఎస్సీలో బయోకెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హెచ్‌పీఎల్‌సీ/జీసీ లేదా ఎల్‌సీఎంఎస్ పరికరాలను కనీసం మూడేండ్లు ఉపయోగించిన అనుభవం ఉండాలి. లేదా ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేదా అప్లయిడ్ న్యూట్రిషన్ చదివి ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లు మించరాదు
జీతం: నెలకు రూ. 28,000/- ఇస్తారు. (కన్సాలిడేటెడ్ పే, ఎటువంటి ఇతర అలవెన్స్‌లు ఉండవు)
నోట్: మొదట ఈ పోస్టును ఏడాది కాలపరిమితికి తీసుకుంటారు. తర్వాత అవసరాన్ని బట్టి మరికొంత కాలం పొడిగించవచ్చు.
ఎంపిక: రాతపరీక్ష, ఆగస్టు 2న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా
మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 1
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ల్యాబ్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: 25 ఏండ్లు మించరాదు
జీతం: నెలకు రూ. 12, 500/- ఇస్తారు.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆగస్టు 2న నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: http://ninindia.org చూడవచ్చు.

499
Tags

More News

VIRAL NEWS