ఎన్‌ఐఈపీఎండీలో ప్రత్యేక కోర్సులు


Mon,July 17, 2017 12:38 AM

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ) కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
ఎన్‌ఐఈపీఎండీ అనేది మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ పరిధిలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ. ప్రస్తుత ప్రవేశాలు 2017 - 18 విద్యాసంవత్సరం కోసం నిర్వహిస్తున్నారు.
-సర్టిఫికెట్ కోర్సు ఇన్ కేర్ గివింగ్ ఏ లెవల్
అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణత
సర్టిఫికెట్ కోర్సు ఇన్ కేర్ గివింగ్ బీ లెవల్
అర్హత: 8వ తరగతి పాసై ఏ లెవల్ సర్టిఫికెట్ ఉండాలి లేదా పదోతరగతి ఉత్తీర్ణత.
సర్టిఫికెట్ కోర్సు ఇన్ కేర్ గివింగ్
అర్హత: పదోతరగతి
డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆటిజం స్పెక్ట్రమ్ డిస్‌ఆర్డర్ (రెండేండ్ల కోర్సు)
అర్హతలు: ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) - నాలుగున్నరేండ్ల కోర్సు
అర్హతలు: ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలు సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ) - 4 1/2 ఏండ్ల కోర్సు
అర్హతలు: ఇంటర్‌లో బైపీసీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వీటితోపాటు కింది కోర్సులు కూడా ఉన్నాయి. అవి...
బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ మల్టిపుల్ డిసెబులిటీస్, ఎంఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ మల్టిపుల్ డిసేబిలిటీస్, పీజీ డిప్లొమా ఇన్ డెవలప్‌మెంటల్ థెరపీ, పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎంఏ సోషల్ వర్క్ (డిసేబిలిటీ స్టడీస్), ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ) కోర్సులు ఉన్నాయి.
అర్హతలు, వయస్సు వేర్వేరు కోర్సులకు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
వెబ్‌సైట్: www. niepmd.tn.nic.in

298
Tags

More News

VIRAL NEWS