ఇస్రోలో 313 అసిస్టెంట్ ఉద్యోగాలు


Sun,July 16, 2017 01:23 AM

డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-ఇండియన్ స్పేస్ డిపార్ట్‌మెంట్‌లో కొలువు
-రాతపరీక్ష+ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక
-ఉద్యోగ భద్రత, మంచి జీత్యభత్యాలు
-చివరితేదీ: జూలై 31

ISRO
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో వివిధ జోన్లవారీగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఇస్రో
సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వివరాలు:
బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 313 (అసిస్టెంట్-311, అప్పర్ డివిజన్ క్లర్క్-2)
ఇస్రో సెంటర్ / యూనిట్లలో అసిస్టెంట్ పోస్టుల వివరాలు:
పోస్టు పేరు: అసిస్టెంట్-272 పోస్టులు (జనరల్-149, ఓబీసీ-75, ఎస్సీ-38, ఎస్టీ-10). పీహెచ్‌సీ అభ్యర్థులకు 19, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 34 పోస్టులను కేటాయించారు.
జోన్లవారీగా ఖాళీలు:
-హైదరాబాద్ - 27 పోస్టులు (జనరల్-14, ఓబీసీ-6, ఎస్సీ-6, ఎస్టీ-1)
-శ్రీహరికోట - 35 పోస్టులు (జనరల్ - 17, ఓబీసీ - 10, ఎస్సీ - 4, ఎస్టీ - 4)
-బెంగళూరు - 97 పోస్టులు (జనరల్ - 52, ఓబీసీ - 28, ఎస్సీ - 12, ఎస్టీ - 5)
-అహ్మదాబాద్ - 20 పోస్టులు (జనరల్ - 12, ఓబీసీ - 5, ఎస్సీ - 3)
-న్యూఢిల్లీ - 4 పోస్టులు (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1)
-తిరువనంతపురం - 89 పోస్టులు (జనరల్ - 52, ఓబీసీ - 25, ఎస్సీ -12)డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (బెంగళూరు)లో యూడీసీ పోస్టుల వివరాలు:
పోస్టు పేరు: అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)- 2 పోస్టులు (ఎస్సీ - 1, ఎస్టీ - 1)
-డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోని అటానమస్ ఇన్‌స్టిట్యూషన్/సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు
పోస్టు పేరు: అసిస్టెంట్-39 పోస్టులు (జనరల్-21, ఓబీసీ-10, ఎస్సీ-5, ఎస్టీ-3). వీటిలో పీహెచ్‌సీ అభ్యర్థులకు 1, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 4 పోస్టులను కేటాయించారు
జోన్లవారీగా ఖాళీలు:
-హైదరాబాద్ - 1 పోస్టు
-బెంగళూరు - 7 పోస్టులు (జనరల్ - 4, ఓబీసీ - 2, ఎస్సీ - 1)
-అహ్మదాబాద్ - 16 పోస్టులు (జనరల్ - 8, ఓబీసీ - 4, ఎస్సీ - 1, ఎస్టీ-3)
-న్యూఢిల్లీ - 14 పోస్టులు (జనరల్-7, ఓబీసీ-4, ఎస్సీ-3)
-తిరువనంతపురం - 1 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్/కామర్స్ లేదా మేనేజ్‌మెంట్ లేదా సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు: 2017 జూలై 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలోఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు సడలింపు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అనుసరించి ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, ప్రతిభావంతులైన స్పోర్ట్స్ అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
పేస్కేల్: రూ. 25,000/-. అదనంగా హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష+స్కిల్ టెస్ట్ ద్వారా
రాతపరీక్ష తేదీ: అక్టోబర్ 15
పరీక్ష కేంద్రాలు : అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కత, తిరువనంతపురం.
-రాతపరీక్షలో ఆబ్జెక్టివ్/డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఆగస్టు 7
వెబ్‌సైట్: www.isro.gov.in

1051
Tags

More News

VIRAL NEWS