ఇన్సూరెన్స్ కంపెనీల్లో 996 ఉద్యోగాలు


Sat,August 12, 2017 11:38 PM

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్) వివిధ ప్రదేశాలు/ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్1 కేటగిరీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
girl
వివరాలు:ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను బొంబాయిలో సెప్టెంబర్ 12, 1947న స్థాపించారు.
-పోస్టు పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య -300
(జనరల్ -158, ఓబీసీ-77, ఎస్సీ-44, ఎస్టీ-21)
-విభాగాలవారీగా ఖాళీలు: అకౌంట్స్-20, లీగల్-30, యాక్చ్యురీస్-2, ఆటోమొబైల్ ఇంజినీర్-15, జనరలిస్ట్-223, మెడికల్ ఆఫీసర్-10
-విద్యార్హతలు:
-అకౌంట్స్: సీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఎంకాం, ఎంబీఏ (ఫైనాన్స్)లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
-యాక్చ్యురీస్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చ్యురీస్ ఆఫ్ ఇండియా నుంచి నాలుగు యాక్చ్యురియల్ పేపర్స్‌లో అర్హత సాధించాలి.
-జనరలిస్ట్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-లీగల్: లా డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఇంజినీర్స్ ఆటోమొబైల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్‌లో బీఈ/బీటెక్ లేదా ఇంజినీరింగ్‌లో పీజీలో 60 శాతం మార్కులతో
లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-గమనిక: పై పోస్టులన్నింటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం ఉత్తీర్ణత.
-మెడికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 జూలై 31 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: రూ. 32795-62315/-. మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు సుమారుగా
రూ. 51,000/- ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ఎంపిక విధానం:
ఫేజ్ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. కాలవ్యవధి 60 నిమిషాలు.
-ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతిభచూపిన వారిని 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.
ఫేజ్ - 2 మెయిన్ ఎగ్జామినేషన్:
జనరలిస్ట్ పోస్టులకు...
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. కాలవ్యవధి 120 నిమిషాలు.
-ఈ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు) అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు.
స్పెషలిస్ట్ పోస్టులకు...
-ఈ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 మార్కులకు ఉంటుంది. కాలవ్యవధి 120 నిమిషాలు.
-ఈ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ( 40 మార్కులు) అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు.
-ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఎస్సే, ప్రిసైస్ రైటింగ్, కాంప్రహెన్షన్) పై పరిజ్ఞానాన్ని పరీక్షించడానకి డిస్క్రిప్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనికి 30 మార్కులు.
-పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. 1/4 వంతు మార్కులను కోతవిధిస్తారు.
-తుది ఎంపిక మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా 80:20 వెయిటేజీ ఇచ్చి భర్తీ చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: తెలుగు అభ్యర్థులకు హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలుతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 81
సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 18
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 15
-ప్రిలిమినరీ ఎగ్జామ్: అక్టోబర్ 22
-మెయిన్ ఎగ్జామ్: నవంబర్ 18
-వెబ్‌సైట్: www.orientalinsurance.org.in

uni
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది. దీన్ని 1938 ఫిబ్రవరి 18న ఏర్పాటు చేశారు.
-పోస్టు పేరు: అసిస్టెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 696
(జనరల్-414, ఓబీసీ-122, ఎస్సీ-110, ఎస్టీ-50)
రాష్ర్టాలవారీగా ఖాళీలు:
-తెలంగాణ-20, ఆంధ్రప్రదేశ్-32, మహారాష్ట్ర-107, తమిళనాడు-131, కర్ణాటక-61, కేరళ-38, అండమాన్ నికోబార్ దీవులు-2, అసోం-15, బీహార్-6, ఛత్తీస్‌గఢ్-15, గోవా-3, గుజరాత్-70, హర్యానా-9, హిమాచల్‌ప్రదేశ్-2, జార్ఖండ్-2, మధ్యప్రదేశ్-20, మణిపూర్-1, మేఘాలయ-1, మిజోరం-1, నాగాలాండ్-1, న్యూఢిల్లీ-31, ఒడిశా-10, పుదుచ్చేరి-7, పంజాబ్-13, రాజస్థాన్-30, సిక్కిం-2, త్రిపుర-1, చంఢీగఢ్-2, ఉత్తరప్రదేశ్-37, ఉత్తరాఖండ్-9,
వెస్ట్‌బెంగాల్-1
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. రీజినల్ లాంగ్వేజ్‌లో పరిజ్ఞానం ఉండాలి. అంటే రాయడం, చదవడం మాట్లాడటం వచ్చి ఉండాలి.
-వయసు: 2017 జూన్ 30 నాటికి గరిష్టంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: 14435-32030/- న్యూ పెన్షన్ స్కీమ్, ఇంటర్నెట్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్, వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ, వెహికిల్ లోన్ ఇతర అలవెన్సులు కలుపుకొని మెట్రోసిటీ ప్రాంతాల్లో సుమారుగా నెలకు
రూ. 23,000/- ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ప్రొబేషన్ పీరియడ్: 6 నెలలు
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), పర్సనల్ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (టైర్ 1):
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-ఈ పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-ఈ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (35 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (35 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి సెక్షన్‌లో కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ఈ పరీక్షలో ప్రతిభచూపిన వారిని 1:7 నిష్పత్తి (రాష్ర్టాలలో ఉన్న ఖాళీలవారీగా)లో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్ (టైర్ 2):
-మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. ఈ పరీక్షను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-ఇది కూడా ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 మార్కులకు ఉంటుంది.
-ఈ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 మార్కులు) అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు.
-ఈ పరీక్షలో ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు కేటాయించారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, తిరుపతి, రాజమండ్రితో సహా దేశవ్యాప్తంగా మొత్తం 193 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
-ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 22
-మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.uiic.co.in

1722
Tags

More News

VIRAL NEWS