ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో


Thu,May 18, 2017 12:02 AM

ఇండియన్ కోస్ట్‌గార్డ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష(ఎస్సీ, ఎస్టీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-COAST-GUARD
వివరాలు:
భారత రక్షణ దళాల పరిధిలోని కోస్ట్‌గార్డ్‌లో ఈ పోస్టులు ఉన్నాయి.
-భారత తీరప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ పాత్ర కీలకమైంది. దీనిలో పనిచేసే ఉద్యోగులకు మంచి వేతనాలు ఉంటాయి. ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తారు.
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
విభాగాలు: జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ పైలట్
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: జనరల్ డ్యూటీ విభాగానికి అభ్యర్థులు 1988 జూలై 1 నుంచి 1997 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. జనరల్ డ్యూటీ పైలట్ విభాగానికి అభ్యర్థులు 1988 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు - 157 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు - 6/6, 6/9
ఎంపిక విధానం: రాతపరీక్ష, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ
జీతభత్యాలు: సుమారుగా నెలకు రూ. 56,100/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి
చివరితేదీ: మే 20
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

510
Tags

More News

VIRAL NEWS