ఇండియన్ ఆర్మీలో 142 పోస్టులు


Mon,July 17, 2017 01:09 AM

-పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులకు అవకాశం
-రక్షణశాఖ పరిధిలో ఉద్యోగాలు
-రాతపరీక్ష, పీఈటీ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్స్‌లు

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ డిపోల్లో ఖాళీల భర్తీకి కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఫీల్డ్ ఆర్డినెన్స్ డిపో, 21 ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, 19 ఇన్ఫో డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్, 28 ఎంటీఎన్
డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టుల సంఖ్య - 142.
మెటీరియల్ అసిస్టెంట్ - 6
అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా డిప్లొమాలో మెటీరియల్ మేనేజ్‌మెంట్ లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
ఎల్‌డీసీ - 1 ఖాళీ
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
జీతం: ప్రారంభవేతనం నెలకు రూ. 19,900/- (సుమారుగా)
ఫార్మాసిస్ట్ - 1
అర్హతలు: ఇంటర్‌తోపాటు ఫార్మసీలో రెండేండ్ల డిప్లొమా చేసి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,400/- వరకు ప్రారంభవేతనం వస్తుంది.
టెలిఫోన్ ఆపరేటర్ - 1
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. పీబీఎక్స్ బోర్డు హ్యాండ్లింగ్ చేయడంలో ప్రావీణ్యత ఉండాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యత ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/-
ఫైర్‌మ్యాన్ - 36
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
జీతం: ప్రారంభవేతనం నెలకు రూ. 19,900/-
ట్రేడ్స్‌మ్యాన్ (మేట్) - 94
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
జీతం: ప్రారంభవేతనం నెలకు రూ. 18,000/-
ఎంటీఎస్ - 1
ధోబి - 1
Army

పై మూడు పోస్టులకు...
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
జీతం: ప్రారంభవేతనం నెలకు రూ. 18,000/-
టైలర్ - 1
అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో టైలర్ ట్రేడ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ. 18,000/- (సుమారుగా)
వయస్సు: మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎల్‌డీసీ, టెలిఫోన్ ఆపరేటర్, ఫైర్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్, ఎంటీఎస్, టైలర్, ధోబి పోస్టులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
శారీరక ప్రమాణాలు: ఫైర్‌మ్యాన్ పోస్టుకు కనీసం 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ - 81.5, గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి. బరువు కనీసం 50 కేజీలు ఉండాలి.
నోట్: ఆయా పోస్టులకు అవసరాన్ని బట్టి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/స్కిల్‌టెస్ట్‌లను నిర్వహిస్తారు.
ఎల్‌డీసీ పోస్టులకు - ఇంగ్లిష్ టైపింగ్ 10 నిమిషాలకు 35 పదాలు టైప్ చేయాలి.
ఫైర్‌మ్యాన్ పోస్టు - ఆరు నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 2.7 మీటర్ల వెడల్పు గుంతను తీయాలి. 63.5 కేజీల బరువుని 183 మీటర్లను 96 సెకండ్లలో మోసుకుపోవాలి. నిలువుగా ఉన్న తాడుతో మూడు మీటర్ల ఎత్తుకు ఎక్కాలి.
ట్రేడ్స్‌మ్యాన్ (మేట్) - ఆరు నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 50 కేజీల బరువును 100 సెకండ్లలో 200 మీటర్లు మోసుకుపోవాలి.
మిగిలిన పోస్టులకు మెడికల్ ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు.
పై టెస్టుల్లో క్వాలిఫై అయినవారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు - 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ఇది డిగ్రీస్థాయిలో ఉంటుంది.
మిగిలిన పోస్టులకు కూడా రాతపరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ప్రకటన విడుదలైన 21 రోజుల్లో పంపాలి.
పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి. Commandant, 21 FAD,
PIN : 909721, C/O 56 APO.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in

2922
Tags

More News

VIRAL NEWS