ఆల్ ఇండియా సీపెట్ జేఈఈ


Wed,April 24, 2019 03:13 AM

ఆధునిక ప్రపంచానికి ప్లాస్టిక్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా.. ఉన్నత విద్యకు, ఉపాధికి అపారంగా అవకాశాలు ఉన్న రంగం ప్లాస్టిక్. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రారంభించిన సంస్థ సీపెట్. ఈ సంస్థ విద్యతోపాటు పరిశోధనలు చేస్తూ దేశానికి ప్లాస్టిక్ రంగ నిపుణులను తయారుచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు క్యాంపసుల్లో డిప్లొమా, యూజీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ \(జేఈఈ) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా...
JEE

-సీపెట్: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్&టెక్నాలజీ. ఈ సంస్థను కేంద్రం 1968లో ప్రారంభించింది. అహ్మదాబాద్, అమృత్‌సర్, ఔరంగాబాద్, అగర్తలా, బడ్డీ, బాలాసోర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చంద్రాపూర్, చెన్నై, డెహ్రాడూన్, గురుగ్రాం, గువాహటి, గ్వాలియర్, హైదరాబాద్, హాజీపూర్, హల్దియా, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, లక్నో, మధురై, ముర్తాల్, మైసూర్, రాయ్‌పూర్, రాంచీ, వల్సద్ (గుజరాత్), విజయవాడల్లో సీపెట్ క్యాంపసులు ఉన్నాయి.
-సీపెట్ జేఈఈ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఈ సంస్థలో ప్రవేశాలు కల్పిస్తారు.
-ప్రవేశాలు కల్పించే కోర్సులు:
-పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ &టెస్టింగ్ (ఏడాదిన్నర కోర్సు)
-అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.
-పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్ (ఏడాదిన్నర కోర్సు)
-అర్హత: మెకానికల్, ప్లాస్టిక్స్ టెక్నాలజీ,టూల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్ లేదా మెకట్రానిక్స్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (మూడేండ్లు)
-డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (మూడేండ్లు)
-అర్హత: పై రెండు కోర్సులకు పదోతరగతి (మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి)

ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 30
-పరీక్ష తేదీ: జూలై 7
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్
-తరగతుల ప్రారంభం: ఆగస్టు 1
-వెబ్‌సైట్: https://www.cipet.gov.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

268
Tags

More News

VIRAL NEWS