అక్బర్ ఆస్థానంలోని నవ రత్నాలు

Mon,March 20, 2017 11:33 PM

tansen
1) అబ్దుల్ రహీం: ఈయన బాబర్ నామాను పర్షియన్ బాషలోకి అనువాదం చేశాడు. ఇతనికి కాన్-ఇ-కానా అనే బిరుదును అక్బర్ ఇచ్చాడు. టర్కీ, హిందీ భాషల్లో రచనలు చేశారు. జ్యోతిష్యం మీద కీతా కౌతుకామా, ద్వావిష్‌డ్ వయోవాలి అనే గ్రంథాలను రాశాడు.
2) అబుల్ ఫజల్: ఈయన అక్బర్ నామా, ఐనీ అక్బరీ గ్రంథాలను రాశారు.
3) బీర్బల్: బ్రాహ్మణుడు అయిన ఈయన అసలు పేరు మహేష్‌దాస్. ఈయన అక్బర్ ఆస్థానంలో న్యాయ నిర్వహణ చేసేవాడు. యూసఫ్ జాయ్ తెగతో యుద్ధం చేస్తుండగా మరణించాడు.
4) అబుల్ ఫైజీ: లీలావతి గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువాదం చేశాడు. అక్బర్ స్థానంలో కావ్యాలు రాసేవాడు.
5) హమీమ్ హ్యుమామ్: ఈయన అక్బర్ స్నేహితుడు. ఆస్థాన పాఠశాలలకు అధిపతిగా ఉండేవాడు.
6) రాజా మాన్‌సింగ్: రాజపుత్ర యోధుడు. హల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాప్‌ని, ఆఫ్ఘన్లను ఓడించాడు. ఈయన సైన్య నిర్వహణ చేసేవాడు.
7) షేక్ ముబారక్: అక్బర్ జారీచేసిన ఆమోఘత్వ ప్రకటనలతో మెహజర్ నామాను రచించాడు.
8) తాన్‌సేన్: గ్వాలియర్‌లో జన్మించాడు. అక్బర్ ఆస్థాన విద్వాంసుడు. ఇతనికి గీత్ సామ్రాట్ అనే బిరుదు ఉంది.
9) తోడర్ మల్: భూమి శిస్తు మొదలైన వాటిని నిర్వహించేవాడు. షేర్షా నుంచి అక్బర్, మరాఠాల వరకు ఈయన విధానాలే పాటించారు.

477
Tags

More News

మరిన్ని వార్తలు...