అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు


Fri,April 21, 2017 12:15 AM

ADB

వరల్డ్ బ్యాంక్ గ్రూప్ (డబ్ల్యూబీజీ)


-దీన్ని 1945లో ఏర్పాటు చేశారు.
-వాషింగ్టన్ డీసీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 189 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
-ఐదు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి.
-ఇందులో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐడీఏ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ (ఐసీఎస్‌ఐడీ), మల్టీలెటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ (ఎంఐజీఏ) సభ్యులుగా ఉన్నాయి.
-ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలికవసతుల కల్పన, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహకారం చేస్తుంది.
-కొరియా రిపబ్లిక్‌కు చెందిన జిమ్ యంగ్ కిమ్ ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా ఉన్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)


-దీన్ని 1945, డిసెంబర్ 27న ఏర్పాటు చేశారు.
-ఇందులో 189 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది.
-ఇది సభ్యదేశాలు ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉండేలా చూస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, బలమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందడానికి, ఆయా దేశాల్లో పేదరికాన్ని తగ్గించడానికి కృషిచేస్తుంది.
-ప్రస్తుతం దీని మేనేజింగ్ డైరెక్టర్‌గా క్రిస్టిన్ లగార్డే పనిచేస్తున్నారు.

ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్


-దీన్ని 2015, డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు.
-ఇందులో భారత్‌తో సహా 50 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
-చైనా రాజధాని బీజింగ్ ప్రధాన కేంద్రంగా ఇది పనిచేస్తుంది.
-ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహాయసహకారాలు అందిస్తుంది. సభ్యదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూరుస్తుంది.
-దీని అధ్యక్షుడు జిన్ లిక్వన్.

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)


-దీన్ని 1966లో ఏర్పాటు చేశారు.
-ఇందులో 67 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
-దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్‌లోని మెట్రోమనీలాలో ఉంది.
-ఆసియా దేశాల్లో పేదరికాన్ని తగ్గించడానికి కృషిచేస్తుంది. ప్రాంతీయ సహకారం, పర్యావరణ పరంగా సుస్థిరాభివృద్ధి సాధించేలా చేస్తూ సభ్యదేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తుంది.
-జపాన్‌కు చెందిన తెకెహికొ నకావో దీని అధ్యక్షుడిగా ఉన్నారు.

యూరోపియన్ బ్యాంక్ ఫర్ రికన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఈబీఆర్‌డీ)


-దీన్ని 1991లో స్థాపించారు
-లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న దీనిలో మొత్తం 67 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు.
-ఈ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షుడిగా సర్ సుమా చక్రవర్తి పనిచేస్తున్నారు.
-పరిశ్రమలు, బ్యాంకులు, వ్యాపారాలకు ఆర్థిక సహకారం చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు లేదా ఇప్పటికే ప్రారంభించిన కంపెనీలకు కూడా ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. 1980 నుంచి డబ్ల్యూటీవో ప్రతిపాదించిన మున్సిపల్ సేవల అభివృద్ధిలో ప్రైవేటీకరణకు మద్దతుగా నిలుస్తున్నది.

యూరోపియన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ (ఈఐబీ)


-దీన్ని 1958లో స్థాపించారు
-దీని ప్రధాన కార్యాలయం లక్సెంబర్గ్‌లో ఉంది. ఇందులో మొత్తం 28 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
-ఈ సంస్థకు ప్రస్తుత అధ్యక్షుడు హోయర్
-ఇది లాభరహిత రుణ సంస్థ.
-ఇది పర్యావరణ స్థిరత్వం తీసుకురావడానికి, రవాణా, ట్రాన్స్ యూరోపియన్ నెట్‌వర్క్ అభివృద్ధికి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహాయం చేస్తున్నది.

510
Tags

More News

VIRAL NEWS