కరెంట్ అఫైర్స్


Wed,August 15, 2018 12:42 AM

Telangana
TELANGANA

కొత్త అడ్వకేట్ జనరల్

తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన జనగామ జిల్లాకు చెందినవారు. ఇప్పటివరకు అడ్వకేట్ జనరల్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డి నాలుగు నెలల క్రితం రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో శివానంద ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది.

జీనోమ్ బ్యాంకు

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)లో జన్యు బ్యాంకును ఏర్పాటుచేశారు. అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడేందుకు, పునరుత్పత్తి చేసేందుకు సీసీఎంబీలోని లాకోన్స్ ల్యాబ్‌లో దీన్ని నెలకొల్పారు. ఈ జీనోమ్ బ్యాంకును కేంద్ర శాస్త్రసాంకేతిక, పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్దన్ ఆగస్టు 12న ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో అరుదైన నల్లహంసల ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటుచేశారు.

కొంకణాసేన్ శర్మ

ప్రముఖ నటి, దర్శకురాలు కొంకణాసేన్‌శర్మ హైదరాబాద్‌లో ఆగస్టు 12న గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. ఎ డెత్ ఇన్ ది గంజ్ అనే చిత్రానికిగాను మొదటి ఉత్తమ నూతన దర్శకత్వం విభాగంలో ఆమెకు అవార్డు లభించింది.

బర్రెల పంపిణీ

రైతులకు ఉపాంత ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం బర్రెల పంపిణీని ఆగస్టు 11న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీతో బర్రెలను పంపిణీ చేస్తారు.

National
National

జాతీయ మహిళా కమిషన్

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రేఖాశర్మ ఆగస్టు 10న పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఆమె హర్యానాకు చెందినవారు.

రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్

రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్‌గా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) అభ్యర్థి హరివంశ్ నారాయణ్‌సింగ్ ఎన్నికయ్యారు. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సభ్యుడైన హరివంశ్‌కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్ష యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్స్ (యూపీఏ) బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి.

ఎన్‌సీబీసీ

జాతీయ వెనుబడిన వర్గాల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుకు ఆగస్టు 6న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకోసం రాజ్యాంగానికి 123వ సవరణ చేశారు. జాతీయ వెనుకబడిన వర్గాల చట్టం 1993 స్థానంలో తాజా బిల్లు చట్టంగా మారనుంది.

మద్రాస్ హైకోర్టు సీజే

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తాహిల్ రమణి ఆగస్టు 12న బాధ్యతలు స్వీకరించారు. తాహిర్‌తో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు.

సోమ్‌నాథ్ ఛటర్జీ

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ ఆగస్టు 12న మరణించారు. 2004-09 మధ్యకాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1971లో తొలిసారిగా సీపీఎం తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మహిళా కమెండోలతో స్వాట్

దేశంలో తొలిసారిగా మహిళా కమెండోల దళాన్ని ఆగస్టు 12న ఢిల్లీలో ప్రారంభించారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్ (స్వాట్)గా పిలుస్తున్న తొలి దళంలో 36 మంది మహిళా కమెండోలు ఉన్నారు. ఉగ్రవాదదాడులను తిప్పికొట్టడానికి, ప్రత్యేకమైన ఆపరేషన్లలో ఈ దళాన్ని వినియోగిస్తారు.

Persons
bamzai_aditya

పీసీఎల్‌వోబీ

అమెరికాలో మరో భారతీయుడు కీలక పదవిని అధిరోహించాడు. దేశంలో మానవహక్కులు, పౌరుల ప్రైవసీని కాపాడేందుకు పనిచేస్తున్న ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు (పీసీఎల్‌వోబీ) సభ్యుడిగా ఇండో అమెరికన్ ఆదిత్య నియమితులయ్యారు. రెండేండ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు.

రామ్‌సేవక్ శర్మ

టెలికమ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రామ్‌సేవక్‌శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. శర్మ 1962 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.

నికొలస్ బెట్

కెన్యా పరుగుల వీరుడు, ప్రపంచ మాజీ చాంపియన్ నికొలస్ బెట్ రోడ్డుప్రమాదంలో ఆగస్టు 8న మరణించారు. 2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఆయన 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం సాధించారు. ఆఫ్రికా హర్డిల్స్ చాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలుచుకున్నాడు.

రాజన్‌నందా

ట్రాక్టర్లు, నిర్మాణరంగ పరికరాలు తయారుచేసే ప్రముఖ సంస్థ ఎస్కార్ట్ గ్రూప్ చైర్మన్ రాజన్‌నందా ఆగస్టు 6న మరణించారు. 1994 నుంచి ఆయన సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.


Sports
Asian-Games

ఆసియా క్రీడలు

ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇండోనేషియాలోని జకర్తాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత్ తరఫున 550 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలు 39 క్రీడాంశాల్లో జరుగనున్నాయి. ఈ పోటీల్లో ప్రముఖ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్‌చోప్రా భారత పతాకధారిగా భారత క్రీడాకారులకు నాయకత్వం వహించారు.

గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ

ఏఐసీఎఫ్ అంతర్జాతీయ మహిళా గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ ఆగస్టు 9న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్, మంగోలియా, వియత్నాం, కజకిస్థాన్, ఉక్రెయిన్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ క్రీడల తొలి అంచె పోటీలు ముంబైలో జరుగగా, రెండో అంచె పోటీలకు హైదరాబాద్ వేదికైంది.

International
Elephant

ఐరాస మానవహక్కుల కమిషన్

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా చిలీ తొలి మహిళా అధ్యక్షులు మిచెల్ బాబిలేట్ నియమితులయ్యారు. ఆమె న్యాయకోవిదురాలు.

పార్కర్ ప్రోబ్

సూర్యుడి బాహ్య పొర కరోనాపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆగస్టు 12న పార్కర్ సోలార్ ప్రోబ్‌ను కేప్ కెనవరాల్‌లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. డెల్టా 4 రాకెట్ ద్వారా ఈ ప్రోబ్‌ను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం కోసం నాసా రూ.10,364 కోట్లు ఖర్చుచేసింది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త యూజీన్ న్యూమన్ పార్కర్ పేరును ఈ ప్రోబ్‌కు పెట్టారు.

వీఎస్ నైపాల్

ప్రముఖ రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత వీఎస్ నైపాల్ ఆగస్టు 12న బ్రిటన్ రాజధాని లండన్‌లో మరణించారు. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932లో జన్మించిన ఆయన పూర్తిపేరు విధ్యాధర్ సూరజ్‌ప్రసాద్ నైపాల్. వలసవాదం, మతఛాందసవాదాలను విమర్శిస్తూ నైపాల్ 30కి పైగా రచనలు చేశారు. ద హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్, ఎ బెండ్ ఇన్ ఏ రివర్, ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్ తదితర బహుళ జనాదరణ పొందిన రచనలు చేశారు. ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే రచనకు ప్రతిష్ఠాత్మక మ్యాన్ బుకర్‌ప్రైజ్ అందుకున్నారు. 2001లో నైపాల్‌కు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. నైపాల్ తల్లిదండ్రులు భారతీయులే.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా ఏటేటా తరిగిపోతున్న ఏనుగుల జాతిని కాపాడేందుకు 2012 నుంచి జరుగుతున్న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఆగస్టు 12న నిర్వహించారు. భారత్‌లో ఏనుగులను కాపాడేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గజారోహణ్ పేరుతో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ), భారత అడవులు, పర్యావరణ శాఖలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి.

అంతర్జాతీయ యువజన దినోత్సం

అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఈ ఏడాది యువజన దినోత్సవ నినాదం సేఫ్ స్పేసెస్ ఫర్ యూత్. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని మొదటిసారి 2000 సంవత్సరం ఆగస్టు 12న నిర్వహించారు. ఈ దినోత్సవం నిర్వహిచాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1999 డిసెంబర్‌లో చేసిన తీర్మానానికి అనుగుణంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

Awards
Award

సింగరేణి

సింగరేణి కాలరీస్ సంస్థ సీఎండీ శ్రీధర్‌కు తెలంగాణ రెడ్ క్రాస్ ఉత్తమ సేవా అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి సంస్థ చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.

742
Tags

More News

VIRAL NEWS