శ్రీవారిని దర్శించుకున్న జగన్


Fri,January 11, 2019 01:36 AM

ys jagan visits tirumala temple

అమరావతి: ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా చేసిన వైసీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్న జగన్ అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. ఒక సామాన్య భక్తుడిలా ముందుకుసాగారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం జగన్ పులివెందులకు వెళ్లారు. మూడురోజులపాటు జగన్ పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles