బాబుకు ఓటమి భయం


Thu,January 10, 2019 02:55 AM

YS Jagan fires on CM Chandrababu Naidu

-జాతీయ రాజకీయాల పేరుతో కొత్త డ్రామా
-ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో వైఎస్ జగన్

అమరావతి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇసుక నుంచి మట్టివరకు అంతా దోపిడీయేనని, ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకొని ఆదరణ-2 అంటూ కొత్తనాటకాలకు తెరలేపుతున్నారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఇచ్ఛాపురంలో విజయసంకల్ప స్థూపాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాటాడుతూ.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యానిఫెస్టోలో 650 వాగ్దానాలు పెట్టి మోసం చేశారని, చంద్రబాబు పాలనలో ఓ వైపు కరువు, మరోవైపు తుఫాన్లు వచ్చాయని విమర్శించారు. బెంగళూరుకు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతారు.. కానీ పక్కనే ఉన్న అనంతపురం రైతన్నను మాత్రం పట్టించుకోరు.

మరుసటి రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటారు.. కానీ పక్కనే ఉన్న సొంత జిల్లా చిత్తూరు రైతులను పలుకరించరు.. ప్రభుత్వ సొమ్మే కదా అని ప్రైవేట్ విమానంలో కోల్‌కతాకు వెళ్లి మమతాబెనర్జీతో చికెన్ తింటారు.. కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోరు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. కానీ ఈ పెద్ద మనిషి నదుల అనుసంధానం.. దేశంలోనే వ్యవసాయంలో మన రాష్ట్రమే నంబర్‌వన్ అంటున్నారని ఆగ్రహించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్ అయ్యారని, రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్యాక్ చేసి రెండింతలు అధిక ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, నిరుద్యోగభృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నటుడు భానుచందర్ వైఎస్సార్సీపీలో చేరారు.

jagan2

అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా తరహా పథకాలను అమలుచేసేందుకు వైసీపీ సిద్ధమైంది. అధికారంలోకి వస్తే ఈ పథకాలను అమలుచేయనున్నట్టు ప్రకటించింది. యేటా మే నెలలో అర్హులైన రైతులకు రూ.12,500 అందిస్తామని ఈ సభలో జగన్ ప్రకటించారు. మృతిచెందిన రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా పేరిట రూ.5 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారాన్ని ఆ కుటుంబంలోని మహిళలకే అందేలా చట్టంచేస్తామని తెలిపారు.

1042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles