బాబు డ్రామాలాడుతున్నారు


Sat,March 23, 2019 02:58 AM

YS Jagan election campaign in Pulivendula

-బాబు పార్ట్‌నరే ఆ సినిమా యాక్టర్
-ఆ పార్టీకి అభ్యర్థులు..డబ్బులు కూడా ఆయనే
-ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే: వైఎస్ జగన్

పులివెందుల: ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు చాలా డ్రామాలాడుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పార్ట్‌నర్.. ఓ సినిమా యాక్టర్ అంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు. శుక్రవారం పులివెందులలో నామినేషన్ దాఖలుకుముందు స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు తన పార్ట్‌నర్‌తో స్క్రిప్ట్ చదివిస్తారని, బాబు ఎలా ఆదేశిస్తే ఆ యాక్టర్ అలా చేస్తారని పేర్కొన్నారు. ఆ యాక్టర్‌కు అభ్యర్థులు, డబ్బులు చంద్రబాబే ఇస్తారన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయి చంద్రబాబు తప్పుడు కేసులు వేయించారు. ఆ కేసు డీల్ చేసిన అధికారి మొదట టీడీపీ నుంచి భీమిలీలో పోటీ చేయాలనుకున్నారు. చంద్రబాబే తన పార్ట్‌నర్ పార్టీలో చేర్చి విశాఖ నుంచి పోటీలో నిలిపారు అని విమర్శించారు. ఎన్ని కుట్రలు, పన్నాగాలు పన్నినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు పంచే డబ్బులకు వైసీపీ నవరత్నాలే పోటీ కావాలని జగన్ పిలుపునిచ్చారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు. యువత ఉద్యోగాల్లేక పొరుగు రాష్ర్టాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న వివేకా ఎంతో సౌమ్యులు.. వివేకాను చంపించింది వీరే.. బురద చల్లేదీ వీరే. కుట్ర ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వివేకాను హత్య చేసి నెపం కుటుంబసభ్యుల మీద వేస్తున్నారు. కడప హత్యారాజకీయాలపై ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో చంద్రబాబుకు డిపాజిట్లు రాని పరిస్థితి ఉంది అని వైఎస్ జగన్ అన్నారు.

పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా!

నాన్నకు , నాకు పులివెందుల అంటే ఎంతో అమితమైన ప్రేమ. ఈ గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా.. ఇక్కడి ప్రజల మంచి తనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కష్టాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పించింది ఈ గడ్డ. నాకు సహనాన్ని కూడా నేర్పించింది. కుట్రలు, కుతంత్రాలు ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది ఈ పులివెందుల గడ్డనే. చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. నిజం కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తుందని అప్పటి వరకు ఓర్పుగా ఉండాలని నేర్పింది ఈ గడ్డనే. మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవటం ఈ గడ్డ బిడ్డలుగా మనందరికీ తెలుసు అంటూ వైఎస్ జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. కుప్పం కోసం ఏమీ చేయని పెద్దమనిషి.. పులివెందుల కోసం అన్నీ చేశానని అబద్దాలాడుతున్నారని విమర్శించారు.
PULIVENDULA-JAGAN1

పులివెందులలో జగన్ నామినేషన్

పులివెందుల: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి మధ్యాహ్నం 1.49 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles