ప్రభుత్వాన్ని నడుపుతారా? వంటశాలనా?: పవార్

Sun,October 13, 2019 02:23 AM

షోలాపూర్: మహారాష్ట్రలో రూ.10కే భోజనాన్ని అందజేస్తామని శివసేన తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (ఎన్సీపీ) శరద్‌పవార్ విమర్శలు గుప్పించారు. 1990లో రాష్ట్రంలో తొలిసారిగా శివసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో జుంకా-భకర్ (గ్రామీణ వంటకమైన రొట్టె, కూర్మ)ను అమ్మే కేంద్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత వాటిని ఎత్తివేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి నాటకానికి శివసేన తెరలేపింది. రూ.10కే భోజనాన్ని అందజేస్తామని చెబుతున్నది. వాళ్లు ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడుపుతారా? లేక వంటశాలను నడుపుతారా? అని నిలదీశారు. శనివారం షోలాపూర్ జిల్లాలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు.

129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles