ఆరెస్సెస్ వాజపేయి ఆత్మ


Fri,August 17, 2018 07:42 AM

writes Atal Bihari Vajpayee the First swayamsevak who became Prime Minister.

-విభేదాలున్నా.. అది స్వల్పమే
-సంఘ్ దిగ్గజాలు వెల్లడి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), మాజీ ప్రధాని వాజపేయి మధ్య పలు అంశాల్లో స్వల్ప విభేదాలు చోటుచేసుకున్నా, సంఘ్ ఎప్పుడూ అటల్జీ హృదయానికి దగ్గరగానే ఉందని సంఘ్ దిగ్గజాలు కొందరు చెప్పారు. ఆరెస్సెస్ కార్యకర్తగా వాజపేయి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాను సంఘ్ సైనికుడినని చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకాడేవారు కాదు. తన రాజకీయ ప్రస్థానానికి సంఘ్ పునాది వేసింది. పాకిస్థాన్‌తో సంబంధాలు, పబ్లిక్ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలను పరివార్‌కు చెందిన స్వదేశీ జాగరణ్‌మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ, వాజపేయి ఎన్నడూ వారిని దూరం పెట్టలేదు అని సంఘ్ దిగ్గజాలు చెప్పారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో సంఘ్ అగ్రనాయకత్వంతో అంతరాలు పొడచూపినా అవి పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా సంఘ్ నేతలను తన నివాసానికి ఆహ్వానించి వారితో చర్చలు జరిపేవారు అని అప్పట్లో అటల్జీకి మీడియా సలహాదారుగా ఉన్న అశోక్‌టాండన్ చెప్పారు. ఆరెస్సెస్ నా ఆత్మ అంటూ 1995లో సంఘ్ వీక్లీ పత్రిక ఆర్గనైజర్‌లో వాజపేయి వ్యాసం రాశారని ఆయన గుర్తుచేశారు. ఆరెస్సెస్‌తో నా ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగిందంటే దాని కారణం నేను సంఘ్‌ను అభిమానించడమే. అంతేకాదు సంఘ్ భావజాలం నన్ను ఆకర్షించింది. అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూసే ఆ కోణం ఇంకా నచ్చింది. ఒక్క సంఘ్‌లో తప్ప ఇలాంటి వాతావరణం ఇంకెక్కడా కనిపించదు. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే సంఘ్ ప్రాథమిక విధి. సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాముల్ని చేస్తూ ఈ ప్రక్రియను మున్ముందు కొనసాగిస్తూనే ఉండాలి అని ఈ వ్యాసంలో అటల్జీ పేర్కొన్నారు.

555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS