ఫోన్‌లో తలాక్ చెప్పి.. ఓ గదిలో బంధించి..


Thu,July 12, 2018 01:29 AM

Woman Given Triple Talaq Locked Up For A Month Without Food Dies

-నెల రోజులుగా ఆహారం, నీళ్లు కూడా ఇవ్వని భర్త
-ఆరోగ్యం క్షీణించి మృతిచెందిన యూపీ మహిళ

న్యూఢిల్లీ, జూలై 11: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో తలాక్ చెప్పడమే కాకుండా ఓ గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. దాదాపు నెల రోజులపాటు ఆమెకు ఆహారం, నీళ్లు కూడా అందించలేదు. తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమె మంగళవారం మృతిచెందారు. ఆ వ్యక్తి గతంలో తన మొదటి భార్యను కూడా ఇలాగే చిత్రహింసలకు గురిచేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నయీం.. రజియాను రెండో పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకున్నప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఫోన్‌లో త్రిపుల్ తలాక్ చెప్పడమే కాకుండా ఓ గదిలో బంధించి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విషయం తెలిసిన రజియా సోదరి నయీం ఇంటికి వెళ్లి తన సోదరిని తీసుకెళ్లారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన రజియాను దవాఖానలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై రజియా సోదరి మాట్లాడుతూ అదనపు కట్నం కోసం నయీం తరచుగా చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మహోబా జిల్లాలో ఇటీవల త్రిపుల్ తలాక్ ఘటన మరొకటి జరిగింది. రొట్టెలు సరిగా చేయలేదన్న కారణంతో ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో తలాక్ చెప్పాడు. అంతకుముందు సిగరెట్లతో కాలుస్తూ ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles