మహిళా పోలీసు సజీవదహనం


Sun,June 16, 2019 02:36 AM

Woman civil police officer hacked burnt alive in Kerala

- ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య
- నిందితుడు కూడా పోలీసే; కేరళలో ఘటన


మవలిక్కర (కేరళ), జూన్ 15: కేరళలో ఓ మహిళా కానిస్టేబుల్ (సీవోపీ)ను మరో కానిస్టేబుల్ దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి అనంతరం పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. అలప్పుజ జిల్లాలోని వళ్లికున్నం ప్రాంతానికి చెందిన సౌమ్య పుష్పకరన్ పౌర పోలీసు అధికారి (సీవోపీ)గా పనిచేస్తున్నారు. శనివారం విధులు పూర్తయిన తర్వాత ఆమె తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎజాస్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను కారులో వెంబడించి ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయారు. వెంటనే దుండగుడు పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. పరుగెత్తుతుండగా వెంటాడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించారు. నిందితుడు ఎజాస్‌కు కూడా 40 శాతం కాలిన గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దవాఖానకు తరలించారు. ఎజాస్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడన్నది తెలియరాలేదు. మృతురాలు సౌమ్య పుష్పకరన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త విదేశాల్లో పనిచేస్తున్నాడు.

1286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles