రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చొంటా


Sat,April 20, 2019 09:33 AM

Will Sit By His Side If Rahul Gandhi Becomes Prime Minister Deve Gowda

- ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన లేదు
- మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడి
బెంగళూరు, ఏప్రిల్ 19: మళ్లీ ప్రధాని కావాలన్న ఆశ తనకు లేదని, ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చోడానికి తాను సిద్ధమేనని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. గురువారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా. కానీ రాజకీయాల్లో కొనసాగాలంటూ, ఎంపీగా పోటీ చేయాలంటూ ఒత్తిడి రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నా. అని తెలిపారు. మాది చిన్న పార్టీ. అయినా మాకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మేడమ్ సోనియాగాంధీ నిర్ణయించారు. కాంగ్రెస్ సహకారంతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. పొత్తు ధర్మాన్ని పాటిస్తాం.. కాంగ్రెస్‌తో కలిసి సాగుతాం అని చెప్పారు. ఏకాభిప్రాయంతో దేవెగౌడ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని మీ కుమారుడు, సీఎం కుమారస్వామి చెబుతున్నారని ప్రశ్నించగా.. తాను ప్రధాని కావాల్సిన అవసరం లేదని, కానీ మోదీ మళ్లీ ప్రధాని అవుతారేమోనన్న బెంగ ఉన్నదని వ్యంగ్యంగా చమత్కరించారు.

299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles