మమత మార్ఫ్‌డ్ ఫొటో కేసులో ప్రియాంక శర్మ విడుదల


Thu,May 16, 2019 12:30 AM

Will not apologise for Mamata Banerjees meme Priyanka Sharma

- క్షమాపణ చెప్పబోనని స్పష్టీకరణ

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మార్ఫ్‌డ్ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు అరెస్టయిన బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మ బుధవారం ఉదయం విడుదలయ్యారు. మమత ఫొటో పోస్ట్ చేసినందుకు తానేమీ పశ్చాత్తాప పడడం లేదని, క్షమాపణ చెప్పబోనన్నారు. తృణమూల్ నేత విభాష్ హజ్రా ఫిర్యాదు మేరకు ప్రియాంకశర్మను ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హౌరా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె బెయిల్ మంజూరు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మమత మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని ప్రియాంకను ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రియాంక స్పందిస్తూ నా చర్యకు క్షమాపణ చెప్పాలని జైలర్ ఓ కాగితం ఇచ్చారు. నేను జైలు నుంచి విడుదల కావాలి కాబట్టి సంతకం చేస్తున్నానని వారికి చెప్పా. అందుకే సంతకం చేశా. మరో ప్రత్యామ్నాయం లేదు అని పేర్కొన్నారు.

117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles