పార్టీ నిర్ణయమే అంతిమం


Wed,April 24, 2019 02:31 AM

Will Do What Party Asks Me To

-వారణాసి నుంచి పోటీ చేయడంపై ప్రియాంక
-కొనసాగుతున్న ఉత్కంఠ

రాయ్‌బరేలీ (యూపీ), ఏప్రిల్ 23: తాను ప్రధాని మోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై పార్టీ నిర్ణయమే అంతిమమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో చెప్పానని, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఆమె అమేథీలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను చాలా చోట్ల తిరిగాను. చాలా మంది ప్రజలను కలిశాను. ఎక్కడికెళ్లినా మోదీపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ప్రజలు తమ వ్యతిరేకతను, కోపాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారు అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాకాంగాంధీ పోటీ చేస్తారా? లేదా? ఒకవేళ పోటీ చేస్తే వారణాసి నుంచేనా? అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది.

201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles