సైకిల్‌పై బాల్యమిత్రుల దగ్గరికి..


Fri,August 17, 2018 07:42 AM

When Atal Bihari Vajpayee rode cycle to meet his friends in GWALIOR

-వాజపేయితో అనుబంధాన్ని పంచుకున్న సోదరుడి కుమార్తె కాంతిమిశ్రా
-అటల్‌జీ మృతితో గ్వాలియర్‌లో విషాదం

గ్వాలియర్, ఆగస్టు 16: అటల్ బిహారీ వాజపేయి తన బాల్యమిత్రులను కలుసుకొనేందుకు సైకిల్‌పై వెళ్లేవారని అతడి సోదరుడి కుమార్తె కాంతి మిశ్రా తెలిపారు. మాజీ ప్రధానితో ఉన్న జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. ప్రధానిస్థాయి వ్యక్తి నిరాడంబరంగా సైకిల్‌పై వెళ్తుండటం చూసి గ్వాలియర్‌వాసులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. తన కుమారుడు నితిన్ మిశ్రా సైకిల్ తీసుకొని వాజపేయి చిన్ననాటి స్నేహితుడైన దీపక్‌ను.. మరికొందరు బాల్యమిత్రులను కలుసుకొనేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. వాజపేయి మరణవార్త విని గ్వాలియర్‌లోని కమల్‌సింగ్ కా భాగ్ ప్రాంతంలో విషాదం అలుముకున్నది. వాజపేయి చివరిసారిగా 2006లో గ్వాలియర్‌ను సందర్శించారన్నారు. ఆయన మూడురోజుల పాటు అక్కడే ఉండి బంధువులతో గడిపారని గుర్తుచేసుకున్నారు. నాలుగేండ్ల క్రితం తాను వాజపేయి అనారోగ్యంతో మంచంపై పడుకున్నప్పుడు చూశానని.. ఇది తనకు చాలా బాధకలిగించిందని తెలిపారు. వాజపేయి గ్వాలియర్‌లో ఉన్న 2000 గజాలస్థలంలో ఉన్న రెండంతస్థుల భవంతిలో చిన్నపిల్లల లైబ్రరీని.. ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఫొటో జర్నలిస్టు ఉదయ్ ఉపాధ్యాయ తెలిపారు. తన తండ్రి కృష్ణ బిహారీ స్మారకార్థం ఆయన తన ఇంటిని ధారాదత్తం చేశారని పేర్కొన్నారు.

1061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS