మసూద్ అజర్ అక్కడే ఉన్నాడు.. పట్టుకో


Wed,February 20, 2019 01:09 AM

What proof do you want Amarinder Singh slams Imran Khan

-ఇమ్రాన్‌కు పంజాబ్ సీఎం సవాల్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు నిర్దిష్టమైన ఆధారాలు, నిఘా సమాచారాన్ని అందించాలన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తక్షణమే స్పందించారు. ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్నాడని, అతడికి ఐఎస్‌ఐ సహాయం చేస్తున్నదని తెలుపుతూ పోయి వెంటనే పట్టుకో అంటూ వ్యాఖ్యానించారు. డియర్ ఇమ్రాన్‌ఖాన్ జైష్ చీఫ్ మసూద్ అజర్ బహావల్‌పూర్‌లో ఉన్నాడు. ఐఎస్‌ఐ సాయంతో దాడులకు కుట్ర చేస్తున్నాడు. వెళ్లి పట్టుకో. నువ్వు పట్టుకోలేకపోతే, మాకు చెప్పు. నీ కోసం మేము అతడిని పట్టుకుంటాం. ముంబైలో 26/11 దాడులపై మేము అందించిన ఆధారాలను ఏం చేశారు. మాటలు చెప్పడం కాదు. ఆచరణలో చూపించు అంటూ ట్విట్టర్‌లో చురకలు వేశారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూడా మాటలు కాదు ఆచరణ కావాలి అని పేర్కొన్నారు. దాడిపై ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరించారు.

378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles