ప్రభుత్వ పరిశీలనలో కొత్త పార్లమెంట్ భవనం


Tue,August 20, 2019 02:25 AM

What PM Modi Said About Revamped Parliament Building Before 2022

-ప్రధాని నరేంద్రమోదీ వెల్లడి
-ఎంపీల కోసం నిర్మించిన 36 డూప్లెక్స్ ఫ్ల్లాట్లు ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించడమా.. ప్రస్తుత భవనాన్నే ఆధునీకరించటమా.. అనే ప్రతిపాదనలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఎంపీల కోసం ఢిల్లీలోని నార్త్ అవెన్యూలో నిర్మించిన 36 డూప్లెక్స్ ఫ్లాట్లను ప్రధాని సోమవారం ప్రారంభిస్తూ.. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో వసతులను మెరుగుపరచాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తనను కోరిన సంగతిని ప్రస్తావించారు. పార్లమెంట్ నుంచే డిమాండ్లు వస్తున్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నది. ప్రస్తుత భవనాన్ని ఏ విధంగా ఆధునికీకరించాలి, కొత్త భవన నిర్మాణం చేపట్టాలా అనే దానిపై అధికారులు మేధోమథనం చేస్తున్నా రు. 75వ స్వాతంత్య్ర వేడుకల నాటికి అది సాకారమయ్యేలా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నేను సూచించాను అని ప్రధాని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల సమయం లో వసతి కోసం ఇబ్బంది పడుతున్న ఎంపీ లు చాలాకాలం హోటళ్లను బుక్ చేసుకోవాల్సి వస్తున్నదన్నారు. కాబట్టి ఎంపీలకు గృహ వసతులను మెరుగుపరచాల్సి ఉందన్నారు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles