ఆయుష్మాన్ భారత్ నుంచి వైదొలుగుతున్నాం


Fri,January 11, 2019 02:38 AM

West Bengal chief minister Mamata Banerjee pulls out from Modi Ayushman Bharat

-ఆరోగ్య పథకం పేరుతో చెత్త రాజకీయాలా?: మమత
కృష్ణనగర్(పశ్చిమబెంగాల్): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరోగ్య పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం చెత్త రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. గురువారం పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పశ్చిమబెంగాల్‌లోని ప్రతి ఇంటికి మోదీ ప్రభుత్వం లేఖలు పంపుతున్నది. ఆ లేఖలపై మోదీ, బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ఫొటోలు ఉన్నాయి. ఓ ఆరోగ్య పథకం పేరుతో ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు.

658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles