బీఎస్పీతో కలిసి బీజేపీని ఓడిస్తాం


Sat,January 12, 2019 02:01 AM

We will do anything to defeat BJP says Akhilesh Yadav

- అమేథీ, రాయ్‌బరేలీలో పోటీ చేయబోమన్న ఎస్పీ అధినేత అఖిలేశ్
- నేడు మాయావతితో కలిసి మీడియా ముందుకు

కనోజ్, జనవరి 11: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించామని, త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీతో కలిసి బీజేపీని దారుణంగా ఓడిస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఉప ఎన్నికల్లో మా అంచనాలు తప్పలేదు.. ఈసారి కూడా తప్పవు అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. శుక్రవారం అఖిలేశ్ యాదవ్ యూపీలోని చౌపాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు విషయాన్ని శనివారం మాయావతితో కలిసి ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు గురించి విలేకరులు ప్రశ్నించినపుపడు..ఆ పార్టీ నాయకులే స్పందించనప్పుడు తాను పొత్తు గురించి ఎందుకు మాట్లాడాలన్నారు.

కానీ అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలను ఆ పార్టీకి వదిలేస్తున్నామని చెప్పారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, సోనియాగాంధీ ఎంపీలుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే తాము పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని బీజేపీ బలపడిందని, కానీ ఎస్పీ, బీఎస్పీ పొత్తు మరింత బలమైనదని పేర్కొన్నారు. మా పొత్తును చూసి బీజేపీ మాత్రమే భయపడటం లేదు. కాంగ్రెస్ కూడా వణికిపోతున్నది అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హమారా కామ్ బోల్తాహై(మేము చేసిన పనులే మాట్లాడుతాయి).. బీజేపీకా ధోకా బోల్తాహై(బీజేపీ చేసిన మోసం మాట్లాడుతుంది) అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు అఖిలేశ్ ప్రకటించారు. బీజేపీ ఇప్పటికే సీబీఐతో పొత్తు పెట్టుకున్నదని ఎద్దేవా చేశారు.

401
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles