విలీనానికి అడ్డంకులుFri,April 21, 2017 02:32 AM

- శశికళ బృందాన్ని బహిష్కరించాలి
- జయ మృతిపై సీబీఐ దర్యాప్తు కోరాలి
-పన్నీర్‌సెల్వం వర్గం ముందస్తు షరతులు

panneerselvam చెన్నై, ఏప్రిల్ 20: తమిళనాడులో ఆసక్తి రేకెత్తిస్తున్న అన్నాడీఎంకే వర్గాల మధ్య సయోధ్య, విలీనం ప్రతిపాదన ఇప్పుడు మలుపులు తిరుగుతున్నది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శిబిరం ముందస్తు షరతులను విధించడంతో విలీనమార్గంలో అవరోధాలెదురవుతున్నాయి. శశికళను, ఆమె కుటుంబసభ్యులను పార్టీ నుంచి పూర్తిగా తొలిగిస్తేనే విలీనం సాధ్యమని, ఇందుకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తికావాలని పన్నీర్‌సెల్వం వర్గం స్పష్టం చేసింది. జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యా ప్తు జరిపించాలని కూడా డిమాండ్ చేసింది. శశికళ కుటుంబాన్ని తొలగించినట్లు ప్రకటించడం మా త్రమే సరిపోదు. ఇదివరలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, టీటీవీ దినకరన్‌ను డిప్యూటీగా పేర్కొం టూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ను కూడా వెనుకకు తీసుకోవాలి అని మాజీ మంత్రి కేపీ మునుస్వామి డిమాండ్ చేశారు. గురువారం ఐదుగంటలపాటు పన్నీర్‌సెల్వం నివాసంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలలిత మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని కో రారు. మేము ముఖ్యమంత్రి పదవి, ప్రధాన కార్యదర్శి పదవినిగానీ ఎప్పుడూ అడుగలేదు. జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని కోరుకుంటున్నాం.
Shashikala
అమ్మ మృతిపై న్యాయవిచారణ, శశికళ కుటుంబం తొలగింపు అనే రెండు షరతులతో ఈ ధర్మయుద్ధాన్ని చేపట్టాం అని ఆయన చెప్పారు. దీనిపై శశికళవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ వైథిలింగం ప్రతిస్పందించారు. ఇందులో ఎలాంటి డ్రామా లేదు. దినకరన్‌ను పక్కకు వైదొలుగాల్సిందిగా కోరాం. అందుకాయన సంతోషంగా అంగీకరించారు అని చెప్పారు. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియ అంత సులభసాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.

గవర్నర్‌తో తంబిదురై, జయకుమార్ భేటీ


palanisamy
ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై, తమిళనాడు మంత్రి జయకుమార్ గురువారం రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తమ భేటీకి రాజకీయ కారణాలేమీ లేవని వారిద్దరు చెప్పారు. ఆర్థికశాఖతోపాటు మత్స్యశాఖను నిర్వహిస్తున్న తాను ఫిషరీస్ యూనివర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి గవర్నర్‌ను కలుసుకున్నట్లు మంత్రి జయకుమార్ తెలిపారు. తాను మర్యాదపూర్వకంగానే తన మిత్రుడైన గవర్నర్‌ను కలిశానని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చెప్పారు.

1044

More News

VIRAL NEWS